శరవేగంగా బల్లార్షా- కాజీ పేట మూడోలైన్

Fri,November 16, 2018 12:06 AM

కాగజ్‌నగర్ టౌన్:బల్లార్షా- కాజీపేట మూడోలైన్ పనులు శరవేగంగా నిర్వహిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ పేర్కొన్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్‌ను గురువారం సం దర్శించారు. పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు ప్రత్యేక రైలులో బల్లార్షా నుంచి ఉదయం 9 గంటలకు కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నా రు. అనంతరం రైల్వేస్టేషన్‌లో విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. ప్ర యాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌత్ సెంట్ర ల్ రైల్వే ద్వారా తగు చర్యలు తీసుకుంటుందన్నా రు. బల్లార్షా నుంచి కాజీజిపేట మూడో లైన్ పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామనీ, ఇప్పటి వరకు 34 కిలోమీటర్ల మేర పూర్తి చేసి, మరో 50 కిలోమీటర్లు చేపడుతామన్నారు. రెండు కొత్త లైన్లు గడ్‌చందూర్ నుంచి ఆదిలాబాద్, ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వయా నిర్మల్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామనీ, రామగుండం నుంచి మణుగూర్ 200 కిలోమీటర్ల లైన్ పనుల సర్వే, బైపాస్ లైన్ పెద్దపల్లి నుంచి ఈ సంవత్సరం సర్వే పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే పెద్దపల్లి లింగంపేట్ జగిత్యాల 83 కిలోమీటర్లు రైల్వే పనులను ఆరు నెల్లో పూర్తి చేస్తామన్నారు. అదే విధం గా కాజీపేట్ బైపాస్ రైల్వే పనులకు నిధులు మం జూరయ్యాయని, త్వరలోనే ప్రారంభిస్తామన్నా రు.

రూ. 205 కోట్లుతో మాణిక్‌గఢ్ నుంచి గఢ్‌చందూర్ వరకు డబుల్ లైన్ సర్వే పనులు చేపట్ట డం జరుగుతుందన్నారు. మానకొండూరు నుంచి ఎల్కతుర్తి కొత్త లైన్ 60 కిలోమీటర్లు మంజూ రైందనీ, మంచిర్యాల నుంచి ఆదిలాబాద్ కొ త్త లైన్ 186 కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్ర ప్ర భు త్వం సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. కా జీపేటలో మిగిలి ఉన్న పనుల కోసం రూ. 200 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ఆసిఫాబాద్, రేచిని రోడ్, మంచిర్యాల, కొత్తపల్లి, ఓ దెల, మంచిర్యాల, పొత్కపల్లి, బిజ్‌గీర్ షరీఫ్, మ ణిక్‌ఘడ్, బెల్లంపల్లి, కాగజ్‌నగర్,మందమర్రి, హ సన్‌పర్తి రోడ్, రవీంద్రఖని, మంచిర్యాల, రామగుండం, కరీంనగర్ రైల్వే స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి హైలేవల్ బ్రిడ్జిలను చేపట్టనున్నట్లు తెలిపారు. మూడు సంవత్సరాల్లో అన్ని స్టేషన్లలో లోలెవల్, హైలెవల్ ఫ్లాట్ ఫారాలు నిర్మించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయనీ, దీంతో గతేడాది అక్టోబర్ 31న రైల్వే క్రాసింగ్ ఉ న్న ప్రాంతాల్లో గేట్లను తొలగించడం జరిగిందనీ, ఆ ప్రాంతాల్లో అండర్ బ్రిడ్జిలను నిర్మించనున్నామన్నారు. రైల్వే లైన్లు మరమ్మతులు ఉన్న ప్రాం తాల్లో వేగవంతంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ నుంచి సేవా గ్రాం వైపు మరికొన్ని రైళ్లను ఆపాలని ప్రయాణికులు కోరగా, సానుకూలంగా స్పందించారు. కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ భద్రత కోసం 20 సీసీ టీవీ కెమెరాలను అమర్చనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీపీవో రమణా రెడ్డి, సీఎన్ దీవాన్ రెడ్డి, డీఆర్‌ఎం అమిత్‌వర్ధన్, సీఏవో విజయ్ అగర్‌వాల్, ఏవోఎన్ మేనేజర్ మధుసూదన్‌రావు, సీసీఎన్ గుణవేఖరం, ప్రిన్సిపల్ ఛీఫ్ ఇంజినీర్ శివప్రసాద్, ప్రిన్సిపల్ ఛీఫ్ సెక్రటరీ ఈ శ్వరరావు, రైల్వే సిబ్బంది ఉన్నారు.

138
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles