మావోయిస్టుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలి


Fri,November 16, 2018 12:05 AM

రెబ్బెన: మావోయిస్టు యాక్షన్ కమిటీ సభ్యు ల కదలికలపై గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ సూ చించారు. మండలంలోని గంగాపూర్‌లో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌ను గురువారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మావోయిస్టు యాక్షన్ టీం సభ్యులను పట్టిస్తే ఇచ్చే బహుమానానికి సంబంధించి పోస్టర్‌ను గ్రామంలో అం టించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మావోయిస్టుల కదలికలపై ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ సమాచారం అందించాలన్నారు. వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా సహకరించాలని కోరారు. రెబ్బెన సీఐ వీవీ రమణమూర్తి, ఎస్‌ఐ దీకొండ రమేశ్ గ్రామస్తులు ఉన్నారు.

మావోయిస్టుల సమచారం అందించి సహకరించాలని డీఎస్పీ సత్యనారాయణ కోరారు. మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో గురువారం రాత్రి సీఐ రమణమూర్తి, ఎస్‌ఐ దీకొండ రమేశ్‌తో కలిసి నిషేధిక మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుల పోస్టర్స్ విడుదల చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యం గా ఉంచుతామని హామీ ఇచ్చారు. గ్రామస్తులు మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...