హై అలర్ట్

Wed,November 14, 2018 11:41 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అ య్యారు. జిల్లాలో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతా లు, సమస్యాత్మక, సున్నితమైన ఎన్నికల కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు తీరం దాటే అవకాశం ఉందనే ఇంటలిజె న్స్ విభాగం హెచ్చరికల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు సరిహద్దుల్లో ఉన్న ప్రాణహిత తీరం వెంబడి మహారాష్ట్ర నుంచి వచ్చే అవకాశం ఉండడంతో తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు మావోయిస్టు ప్రభావిత గ్రామాలో, అటవీ ప్రాంతాల్లో ఇప్పటికే ప్రత్యేక బలగాలతో కూంబింగ్ ముమ్మరం చేశారు. సరిహద్దుల వెంట చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. తీరం గుండా మావోయిస్టులు జిల్లాలోకి ప్రవేశించే అవకాశం లేకుండా కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తున్నారు.

ముఖ్య నేతలకు భద్రత పెంపు
జిల్లాలో ప్రముఖ ప్రజా ప్రతినిధులకు ఇప్పటికే భద్రత పెంచిన పోలీస్ అధికారులు, ఎప్పటికప్పుడు వారు ప్రయాణించే రహదారులు, పర్యటించే గ్రామాలపై పూర్తి నిఘా పెడుతున్నారు. ఎన్నికలు శాంతియుతంగా పూర్తయ్యేవరకు అయా పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారు లు, సిబ్బంది అప్పమత్తంగా ఉండాలని జిల్లా పో లీస్ బాస్ ఇప్పటికే పలుమా ర్లు ఆదేశించారు. ఆయనే స్వయంగా పలు స్టేషన్లను, చెక్‌పోస్టులను తనిఖీ చేస్తున్నారు. సిబ్బందికి అవసరమైన సూచనలు చే స్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారానికి వెళ్లేటప్పుడు ఆయా పోలీస్‌స్టేషన్లకు ముందుగా సమాచారం అందించాలని కోరుతున్నారు.

పట్టిస్తే రూ. 5 లక్షలు
ప్రజలను అప్రమత్తం చేసేందుకు మావోయిస్టుల ఫోటోలతో ముద్రించిన వాల్ పోస్టర్‌ను బుధవారం ఎస్పీ మల్లారెడ్డి విడుదల చేశారు. మావోయిస్టుల సమాచారం తెలియజేసిన వారికి రూ. 5 లక్షలు బహుమానంగా ఇవ్వనున్నట్లు ఈ పోస్టర్లలో పేర్కొన్నారు. 13 మంది మావోయిస్టుల ఫొటోలతో ము వాల్ పోస్టర్లను ఆయా గ్రామాల్లో అంటించనున్నా రు. ఇందులో జిల్లా పోలీస్ అధికారుల ఫోన్ నం బర్లు పొందుపరిచారు. తనిఖీల్లో భాగంగా పక్క రా ష్ట్రంతో పాటు జిల్లాల పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా సరిహద్దుతో సం బంధాలు ఉన్న మావోలపై పూర్తి నిఘా పెట్టారు.

మావోయిస్టుల వివరాలు..
1.మైలాపు అడెల్లు అలియాస్ భాస్కర్, నర్సన్న, క్రాంతి, పోచ్చర గ్రామం, బోథ్ మండలం, ఆదిలాబాద్ జిల్లా
2. వర్గేష్, ఛత్తీస్ గఢ్
3. మొంబర్ సోడి నర్సింహారావు, కుర్నిపల్లి, చెర్ల మండలం, భద్రాద్రి కొత్తకూడెం జిల్లా
4. ఆత్రం లచ్చు, అలియాస్ గోపన్న, పారెపల్లి, కోటపల్లి మండలం, మంచిర్యాల జిల్లా
5. రాము, గ్రామం జల్లా, మండలం వెంకటాపూరం
6. కుర్సం మంగుల అలియాస్ భధ్రు, పాపన్న చెరమాంగి గ్రామం , బీజాపూర్ , ఛత్తీస్ గఢ్
7. లింగయ్య, అలియాస్ రాకేష్, లింగు, మరకంగూడ గ్రామం, కుంట తాలూక, ఛత్తీస్ గఢ్
8. మడావి కాయ అలియాస్ రమేశ్, సిలకలగూడ. ఏరుళ్ల బయ్యారం, భద్రాద్రి కొత్తగూడెం
9. కొవ్వాసి గంగా అలియాస్ మహేష్, నెమలిగూడ, సుక్మాజిల్లా, ఛత్తీస్ గఢ్
10. మంగతు , ఛత్తీస్ గఢ్
11. పండు అలియాస్ మంగులు, కొట్టం, టైరంఘడ్,బీజాపూర్, ఛత్తీస్ గఢ్
12. బెడె చొక్కా రావు, అలియాస్ దామోదర్
13. కంకణాల రాజిరెడ్డి, వెంకటేష్, కిష్టంపేట్, శ్రీరాంపూర్, కరీంనగర్

175
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles