టీఆర్‌ఎస్ గెలుపు ఖాయం

Wed,November 14, 2018 01:31 AM

-సర్వేల్లో కోవ లక్ష్మి ముందున్నదని కేసీఆరే చెప్పారు
-ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్
-జిల్లా కేంద్రంలో కార్యకర్తలు నాయకులతో సమావేశం
-ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఆరోపణలు : కోవ లక్ష్మి
-నా బిడ్డను గెలపించుకుంటాం : అరిగెల
-గోలేటి, ఆసిఫాబాద్, కిష్టాపూర్‌కు చెందిన 350 మంది చేరిక
ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం నియోజవర్గంలోని గోలేటి, ఆసిఫాబాద్, కిష్టాపూర్, తదితర గ్రామాలకు చెందిన 350 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేయించిన నాలుగు సర్వేల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి ముందంజలో ఉన్నట్లు స్యయంగా ఆయనే తెలిపారన్నారు. కొందరు కాంగ్రెస్ నాయకులు గొబెల్ ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. ఓటమి భయంతోనే కోవ లక్ష్మిపై, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. టీజేఎస్ పార్టీని కోదండరాం ఆంధ్రాబాబు దగ్గర కుదువ పెట్టారని ఆరోపించారు. కమ్యూనిస్టుల జెండా వెలిసిపోయిందని విమర్శించారు. అనంతరం టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆరిగెల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. నా బిడ్డ (ఆసిఫాబాద్ అభ్యర్థి కోవ లక్ష్మి)ని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని తీరుతామన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించే నాయకురాలు కోవ లక్ష్మి అని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తా ప్రజల మధ్యలో ఉంటూ ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించాలన్నారు. ఆ తర్వాత ఆసిఫాబాద్ అభ్యర్థి కోవ లక్ష్మి మాట్లాడారు. ఓటమి భయంపట్టుకునే కాంగ్రెస్ నాయకులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న ఆత్రం సక్కు, నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధీ చేయలేదని ఆరోపించారు. ఆయన ప్రజల కోసం పనిచేయలేదనీ, కేవలం కొంతమంది కోసమే పనిచేశారన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో పట్టణంలో రూ.3 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. ఆదివాసులను ఆత్రం సక్కు నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి స్వచ్ఛందంగా ప్రజా ప్రతినిధులు, ప్రజలు, అన్ని సంఘాల నాయకులు టీఆర్‌ఎస్ చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంధం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ చైర్మన్ చిలువేరు వెంకన్న, సింగిల్‌విండో చైర్మన్ అలీబిన్ హైమద్, జడ్పీటీసీ బాబూరావ్, రెబ్బెన, ఆసిఫాబాద్ మండలాల పార్టీ అధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి, గాదెవెణి మల్లేశ్, రెబ్బెన ఎంపీపీ సంజీవ్‌కుమార్, నాయకులు మహెమూద్, ఎస్‌కే హైమద్, హైమాద్‌బిన్‌అబ్దుల్లా, ఖాళీద్, ఉత్తమ్‌నాయక్, సుగుణాకర్, సుధాకర్, అశోక్, రమేశ్, రవి, చిప్ప చిట్టిబాబు, గణేశ్, గిరిగౌడ్, సాలం ఉన్నారు.

143
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles