1098 హెల్ప్‌లైన్ కేంద్రం ప్రారంభం

Wed,November 14, 2018 01:22 AM

రామకృష్ణాపూర్ : గద్దెరాగడిలోని డయోసిస్ ఆఫ్ ఆదిలాబాద్ హ్యూమన్ ప్రమోషన్ సొసైటీలో చైల్డ్‌లైన్ సే దోస్త్ 1098 జిల్లా హెల్ప్‌లైన్ కేంద్రా న్ని మంగళవారం బాలల సంరక్షణ అధికారి ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ 1098 టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు పాటు అందుబాటులో ఉంటుందన్నా రు. జిల్లాలోని అనాథలు, హింసకు, కిడ్నాపునకు గురైన వారు 1098కు ఫోను చేస్తే వెంటనే వారికి రక్షణగా వెళ్తామన్నారు. ఈ నెల 14 నుంచి 20 వరకు బాలల హక్కుల వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పారు. మినిస్ట్రి వుమెన్, చైల్డ్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ఈ కేంద్రం పని చేస్తుందని తెలిపారు. దీని ద్వారా రక్షణ పొందిన బాలలను ఎక్కడికి ఎలా పంపాలనే విషయంపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుం టామని పేర్కొన్నారు. 14 ఏళ్లలోపు చిన్నారులు పని స్థలాలో కనిపిస్తే యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలల సంరక్షణ చట్టం 2015ను ద్వారా ఈ కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. 1098ను విస్తృత ప్రచారం కోసం నవంబర్ 14 నుంచి వారం పాటు జిల్లాలోని పలు పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇండ్లలో పనివాళ్లుగా అవస్థలు పడుతున్న బాల కార్మికులకు ఆశ్రయం కల్పిస్తామని తెలిపారు. బాలల రక్షణ కోసం 1098కు సమాచారం ఇచ్చేవారి సమాచారం గోప్యంగా ఉంచుతామన్నారు. పిల్లల దత్తత విషయంలో ప్రజలు చట్టప్రకారం వ్యవహరించాలని సూచించారు. హెల్ప్‌లైన్ కేంద్రం డైరెక్టర్ రాబిన్ మాట్లాడుతూ 24 గంటల పాటు సహాయ కేం ద్రంలో సిబ్బందిని, సహాయకులను కలెక్టర్ మా ర్గనిర్ధేశనంలో ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం చైల్డ్‌లైన్ సే దోస్త్ పోస్టర్లను విడుదల చేశారు. సంస్థ డైరెక్టర్ రాబిన్, హెల్ప్‌లైన్ కో-ఆర్డినేటర్ సత్యం, సిబ్బంది పాల్గొన్నారు.

118
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles