కాంగ్రెస్‌లో కలకలం

Wed,November 14, 2018 01:21 AM

-తొలి జాబితాలో డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డికి షాక్
-ఏలేటి ప్రతిపాదించిన వారిలో ఇద్దరికే అవకాశం
-రేవంత్‌రెడ్డి వర్గానికీ దక్కని ప్రాధాన్యం
-ఎట్టకేలకు ఏడు నియోజక వర్గాలకు అభ్యర్థుల ప్రకటన
-పెండింగ్‌లో ఖానాపూర్, బోథ్ సెగ్మెంట్లు
-అన్ని చోట్ల అసమ్మతి.. తప్పని రెబల్స్ బెడద
నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : సుదీర్ఘ నిరీక్షణ, వాయిదాల మీద వాయిదాల తర్వాత.. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొ త్తం పది అసెంబ్లీ నియోజక వర్గాలుండగా.. బెల్లంపల్లి నియోజక వర్గాన్ని సీపీఐకి కేటాయించింది. మిగతా తొమ్మిది నియోజక వర్గాల్లో ఏడు చోట్ల అభ్యర్థులకు తొలి జాబితాలో స్థానం కల్పించింది. నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి, ముధోల్‌లో రామారావు పటేల్, ఆదిలాబాద్‌లో గండ్రత్ సుజాత, ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు, సిర్పూర్(టి)లో పా ల్వాయి హరీశ్‌బాబు, చెన్నూర్‌లో బీవెంకటేశ్ నేత, మంచిర్యాలలో కొక్కిరాల ప్రేంసాగర్‌రావు పేర్లు తొలి జా బితాలో వచ్చాయి. గిరిజన నియోజకవర్గాలైన బో థ్, ఖానాపూర్‌లో అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టారు. ఈ రెండు నియోజక వర్గాల కు అభ్యర్థులను రెండు, మూడు జాబితాల్లో ప్రకటిస్తారనే ఆశతో ఆశావహులు ఉన్నారు. బోథ్ నియోజక వర్గంలో సోయం బాపురావు, అనిల్ జాదవ్, ఖానాపూర్ నియోజక వర్గంలో రాథోడ్ రమేశ్, అజ్మీరా హరినాయక్ తీవ్రంగా పోటీ పడుతున్నారు.

కేటాయింపులో డీసీసీ అధ్యక్షుడికి షాక్
తొలి జాబితాలో ప్రకటించిన ఏడు స్థానాల అభ్యర్థుల్లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి చెప్పిన వారికి అంతగా అవకాశం దక్కలేదు. ఆదిలాబాద్‌లో భార్గ వ్ దేశ్‌పాండే, మాజీమంత్రి రాంచంద్రారెడ్డి, మంచిర్యాలలో గడ్డం అరవింద్‌రెడ్డి, బోథ్‌లో అనిల్ జాద వ్, ఖానాపూర్‌లో భుక్యా జానుబాయి పేర్లను డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి సూచించగా.. వీరికి అవకాశం దక్కలేదు. డీసీసీ అధ్యక్షుడు సూచించిన వారి లో ముధోల్‌లో పవార్ రామారావు పటేల్, సిర్పూర్(టి)లో హరిబాబుకు మినహా.. ఆయన ప్రతిపాదించిన వారిలో మిగతా వారికి అవకాశం రాలేదు. ఆదిలాబాద్‌లో గండ్రత్ సుజాత, మంచిర్యాలలో కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కుకు టికెట్లు రావడం డీసీసీ అధ్యక్షుడికి మింగు డు పడని అంశంగా ఉందని పార్టీలో చర్చ నడుస్తోం ది.

చెన్నూర్‌లో మాజీమంత్రి బోడ జనార్దన్ రేవంత్‌రెడ్డి వర్గీయుడుకాగా.. ఆయనకు టికెట్ నిరాకరించారు. రేవంత్ వర్గంలోని మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావుకు బోథ్ టికెట్ వస్తుందని భావించగా.. చివరికి పెండింగ్‌లో పెట్టారు. డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి అనిల్ జాదవ్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. అది పెండింగ్‌లో పడింది. ఇక్కడ కూడా డీసీసీ మాటకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోగా.. రేవంత్ వర్గీయుడి పేరు కూడా ప్రకటన చేయకుండా పెండింగ్‌లో పెట్టారు. ఖానాపూర్‌లో ఇటీవల పార్టీలో చేరిన రాథోడ్ రమేశ్ పేరు దాదాపు ఖరారైనప్పటికీ.. అజ్మీరా హరినాయక్ వర్గీయులు గాంధీభవన్ ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు ది గారు. దీంతో ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయని అధిష్టానం పేర్కొనడంతో హరినాయక్ వర్గీయులు దీక్ష విరమించగా.. ఇక్కడ అభ్యర్థి ఎవరనేది పెండింగ్‌లో పెట్టారు. ఖానాపూర్‌లోనూ డీసీసీ అధ్యక్షుడు ఏలేటి ప్రతిపాదించిన భుక్యా జానుబాయి పేరును కూడా పరిగణలో తీసుకోలేదని తెలుస్తోంది.

అన్ని చోట్ల గ్రూపులే.. తప్పని రెబల్స్ బెడద
జిల్లాలో ఒకటి, రెండు నియోజకవర్గాలు మినహా.. అన్ని చోట్ల గ్రూపు తగాదాలు, వర్గపోరు నడుస్తోం ది. పార్టీ క్షేత్రస్థాయి వరకు వర్గాలుగా విడిపోగా.. ఎవరికి వారు టికెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి కొందరు సఫలీకృతులుకాగా.. మరికొందరికి తీవ్ర నిరాశే మిగిలింది. దీంతో ఒక అభ్యర్థికి మరొకరు సహకరించే పరిస్థితులు లేకుండా పోయాయి. మంచిర్యాలలో గడ్డం అరవింద్‌రెడ్డి, కె.ప్రేంసాగర్‌రావు మధ్య తీవ్రంగా పోటీ ఉండగా.. చివరికి అధిష్టానం ప్రేంసాగర్‌రావుకే మొగ్గు చూ పింది. దీంతో గడ్డం అరవింద్‌రెడ్డి తన దారి తాను చూసుకునే పనిలో పడ్డారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని.. లేదంటే పార్టీ మారాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే భవిష్యత్తు కార్యాచరణపై కార్యకర్తలతో చర్చిస్తుండగా.. బీజేపీలో చేరతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. చెన్నూర్‌లో వెంకటేశ్‌కు టికెట్ రావటంతో.. మాజీమంత్రి బోడ జనార్ధన్ సహకరించే పరిస్థితి లేదు.

తన దారి తాను చూసుకోవాలని.. రెబల్ అభ్యర్థిగా బరిలో దిగే యో చనలో ఉన్నట్లు తెలిసింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో గండ్రత్ సుజాతకు వ్యతిరేకంగా మాజీమంత్రి సీరాంచంద్రారెడ్డి, భార్గవ్ దేశ్‌పాండే ఉం డగా, వీరు సహకరించే పరిస్థితి లేదు. ముధోల్‌లో పవార్ రామారావు పటేల్‌కు వ్యతిరేకంగా ఆయన బంధువు భోంస్లే నారాయణరావు పటేల్ ఉండగా.. ఆయన వర్గం మద్దతు లభించడం కష్టంగానే ఉంది. తమ దారి తాము చూసుకునేందుకు కార్యకర్తలతో సమావేశమవగా.. ఏదో ఒక జాతీయ పార్టీ నుంచి బరిలో దిగాలని భావిస్తున్నారు. సిర్పూర్(టి)లో పా ల్వాయి హరిబాబుకు వ్యతిరేకంగా రావి శ్రీనివాస్ ఉండగా, ఆయన సహకరించే పరిస్థితి లేదు. బెల్లంపల్లి నియోజకవర్గాన్ని సీపీఐకి ఇవ్వటంపై, కాంగ్రెస్ నుంచి గతంలో పోటీ చేసి ఓడిన చిలుముల శంకర్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. శంకర్ కూడా పోటీ లో ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

134
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles