మెరుగైన వైద్యమందించాలి

Wed,November 14, 2018 01:20 AM

-సిబ్బంది సమయపాలన పాటించాలి
-కంటి వెలుగు విజయవంతం చేయాలి
-మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగాం అధికారి సుబ్బారాయుడు
-లోనవెల్లి పీహెచ్‌సీ తనిఖీ
సిర్పూర్(టి) : ప్రభుత్వ దవాఖానలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగాం అధికారి సుబ్బారాయుడు వైద్యులకు సూచించారు. సిర్పూర్(టి) మండలం లోనవెల్లి గ్రామంలోని పీహెచ్‌సీని మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్‌వో సునీల్‌రావ్‌తో కలసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలోని పలు రిజిస్టర్లను పరిశీలించారు. దవఖానలోని వసతుల గురించి వైద్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వైద్యులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. అనంతరం లోనవెల్లిలో నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ ప్రజలతో మమెకమై, పథకం విజయవంతమయ్యేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో లోనవెల్లి మెడికల్ ఆఫీసర్ తిరుపతి, కంటి వెలుగు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుజాత, హెచ్‌ఈవో పున్నమయ్య, నర్సన్న, వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

116
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles