మోగిన రణభేరి


Tue,November 13, 2018 12:06 AM

-తొలి రోజు టీఆర్‌ఎస్ నుంచి కోవ లక్ష్మి, కాంగ్రెస్ నుంచి ఆత్రం సక్కు దాఖలు
-సిర్పూర్ నియోజకవర్గం నుంచి నిల్
-మంచి ముహూర్తం చూసుకుంటున్న కోనప్ప
-మరింత ముమ్మరం కానున్న ప్రచారం
-జిల్లాలో 4 గంటల వరకే పోలింగ్ : ఎలక్షన్ కమిషన్
కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి/ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : అసెంబ్లీ ఎన్నికల నగార మోగింది. నామినేషన్ల పర్వం మొదలైంది. సోమవారం నోటిఫికేషన్ వెలువడిన తొలిరోజునే ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆత్రం సక్కు నామినేషన్ వేశారు. ఆదివారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ చేతలు మీదుగా బీ-ఫా రం అందుకున్న కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌తో కలిసి ఆసిఫాబాద్ రిటర్నింగ్ అధికారి దత్తుకు మధ్యాహ్నం 12.40 గంటలకు పత్రాలు అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారని పేర్కొన్నారు. వారి ఆదరణతో తనకు మళ్లీ ఎమ్మెల్యేగా అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫారం లేకుండానే ఆ పార్టీ నుంచి ఆత్రం సక్కు నామినేషన్ వేశారు. సిర్పూర్-టి నియోజకవర్గంలో తొలి రోజు ఎవరు కూడా నామినేషన్లు వేయలేదు.

19 వరకు దరఖాస్తుల స్వీకరణ...
సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12 నుంచి 19 వ తేదీవరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వకరించనున్నారు. 20 న పరిశీలన, 22 ఉపసంహరణ ఉంటుంది. డిసెంబర్ 7న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా నిర్వహిస్తారు. కానీ జిల్లాలో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమీషన్ స్పష్టం చేసింది. డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను వెలువరించనున్నారు. డిసెంబర్ 13న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ ముగించనుంది.

సిర్పూర్-టిలో నిల్...
సిర్పూర్-టి నియోజకర్గంలో మొదటి రోజు అభ్యర్థులు ఒక్క నామినేషన్ కూడా వేయలేదు. ఈ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కోనేరు కోనప్ప పార్టీ బీ- పారం పొందినప్పటికీ మంచి ముహూర్తం కోసం చూసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ టికెట్లను ఆశిస్తున్న అభ్యర్థులు పొత్తులు లేకపోవడంతో నామినేషన్ వేయలేదని తెలుస్తోంది.

మరింత ముమ్మరం కానున్న ప్రచారం...
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో జిల్లాలో ఎన్నికల ప్రచారం మరింత ముమ్మరం కానున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుండగా కూటమిలో పొత్తులు తేలకపోవడం.. అభ్యర్థులు ఇంకా బయటకు రావడం లేదు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు బీ ఫారాలు తీసుకొని నామినేషన్లు వేస్తుంటే కూటమిలోని కాంగ్రెస్, మిగతా పార్టీల అభ్యర్థులు టికెట్లకోసం ఆయా పార్టీ కార్యాలయా చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు.

130
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...