ఎన్నికల నియమావళి పాటించాలి

Tue,November 13, 2018 12:05 AM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుండిచి ప్రారంభమైందన్నారు. ఈ నెల 19వ తేదీ దాకా నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉందన్నారు. 20న నామినేషన్ల పరిశీలన, 22వ తేదీ వరకు ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల సంఖ్యకు అధనంగా మొత్తం బీయూ(బ్యాలెట్ యూనిట్)లు 844, సీయూ(కంట్రోల్ యూనిట్)లు 653, వీవీ ప్యాట్స్ 720 అందుబాటులో ఉన్నాయన్నారు. సిర్పూర్-001 నియోజకవర్గానికి బ్యాలెట్ యూనిట్లు 256, కంట్రోల్ యూనిట్లు 256, వీవీ ప్యాట్స్ 256, అదనంగా బ్యాలెట్ యూనిట్లు 20 శాతం, కంట్రోల్ యూనిట్లు 10 శాతం, వీవీ ప్యాట్స్ 20 శాతం అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు.

అలాగే ఆసిఫాబాద్-005 నియోజకవర్గానికి బ్యాలెట్ యూనిట్లు 276, కంట్రోల్ యూనిట్లు 276, వీవీ ప్యాట్స్ 276, అదనంగా బ్యాలెట్ యూనిట్లు 20 శాతం, కంట్రోల్ యూనిట్లు 10 శాతం, వీవీ ప్యాట్స్ 20 శాతం అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ట్రైనింగ్ అవర్నెన్స్ కోసం బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్స్ 40, అదనంగా బ్యాలెట్ యూనిట్లు 164, కంట్రోల్ యూనిట్లు 27, వీవీ ప్యాట్స్ 40 కేటాయించామని చెప్పారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో రాజకీయ పార్టీల సహకారం ఎంతో అవసరమన్నారు. గతంలో అందించిన విధంగానే సహకరించాలని కోరారు. పార్టీలు, అభ్యర్థులు ప్రవర్తనా నియమావళి పాటించేలా చూడాలని కోరారు. అనంతరం గోడౌన్‌లోని బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో జేసీ రాంబాబు, ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఎన్నికల ఎక్స్‌ఫెండేచర్ అబ్జర్వర్ పర్యటన..
ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ఎక్స్‌పెండేచర్ అబ్జర్వర్ మురళీధరన్ పర్యటించనున్నట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. సోమవారం ఎన్నికల ఎక్స్‌ఫెండేచర్ అబ్జర్వర్ మురళీధరన్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎస్పీ మల్లారెడ్డితో ప్రత్యేక బేటీ అయ్యారు. ఎన్నికలపై మూడు రోజుల పాటు జిల్లాలో ఉండి పర్యవేక్షిస్తారన్నారు. ఏమైనా సందేహాలుంటే ఎన్నికల ఎక్స్‌ఫెండేచర్ అబ్జర్వర్ నంబర్ 9533395280కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు.

142
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles