ఏసీబీ వలలో జిల్లా పశు వైద్యాధికారి

Tue,November 13, 2018 12:05 AM

మంచిర్యాల రూరల్ : జిల్లా పశు సంవర్ధక శాఖ, పశు వైద్యాధికారి ఓ కాంట్రాక్టర్ మేనేజర్ వద్ద సోమవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన మొయినొద్దీన్‌కు 2017 నుంచి 2019వరకు వివిధ ప్రాంతాల నుంచి సబ్సిడీ గొర్రెలను సరఫరా చేసేందుకు టెండర్‌ను ప్రభుత్వం నుంచి పొందారు. ఇతడికి ఇటీవల గొర్రెలను సరఫరాకు సంబంధించిన రూ. 43 లక్షల బిల్లు మంజూరైంది. కాగా దాని చెక్కు ఇచ్చేందుకు పశువైద్యాధికారి ఎల్లన్న రూ. లక్ష డిమాండ్ చేశారు. గత నెల 20వ తేదీన మొయినొద్దీన్ మేనేజర్ వెంకటేశ్వర్లు రూ.50 వేలను ఎల్లన్నకు లంచంగా ఇచ్చారు. మరో రూ. 50 వేలు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. దీంతో వెంకటేశ్వర్లు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రూ. 50 వేలు సోమవారం ఇచ్చేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు. దీంతో కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్, ఆదిలాబాద్ డీఎస్పీ ప్రతాప్ వల పన్నారు. పశువైద్యాధికారికి రూ. 50వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పంచనామా నిర్వహించిన అనంతరం ఎల్లన్నను కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు.

వేధింపులు భరించలేకనే..
- వెంకటేశ్వర్లు, కాంట్రాక్టర్ మొయినోద్దీన్ మేనేజర్
మాకు రావాల్సిన బిల్లు ఇవ్వాలంటే కచ్చితంగా లంచం ఇవ్వాల్సిందే. లంచం ఇవ్వనిదే పశుసంవర్ధక శాఖ అధికారి చెక్కులు ఇవ్వడం లేదు. రూ. 43 లక్షల చెక్కు తయారై ఉంది. ఆ చెక్కు ఇవ్వాలంటే రూ. లక్ష డిమాండ్ చేశారు. రూ. లక్ష ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నా. అందులో గత నెల 20వ తేదీన రూ.50 వేలు ఇచ్చాను. మిగితా రూ. 50 వేలను సోమవారం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నా. మిగితా డబ్బుల కోసం చేసిన ఒత్తిడిని భరించలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఏసీబీని ఆశ్రయించాల్సి వచ్చింది.

133
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles