క్షయ నివారణకు ప్రత్యేక చర్యలు


Tue,November 13, 2018 12:05 AM

రెబ్బెన : జిల్లాలో క్షయ నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సీతారాం పేర్కొన్నారు. రెబ్బెన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం హైదరాబాద్ నుంచి వచ్చిన సిబినాట్ ప్రత్యేక వాహనంలో వ్యాధి నిర్ధారణ పరీక్షా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. మండలంలోని 60 మందికి వైద్య పరీక్షలు చేసి, 20 మంది అనుమానితులుగా గుర్తించినట్లు చెప్పారు. వారికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయితే నయమయ్యేదాకా మెరుగైన చికిత్స ఇక్కడి నుంచి అందించడం జరుగుతుందన్నారు. మండలంలో ఎవరైనా రెండు వారాలు మించి దగ్గు, తెమడ, సాయంత్రం పూట జ్వరం రావడం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం లాంటి లక్షణాలు ఉంటే రెబ్బెన పీహెచ్‌సీలో క్షయ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్షయ పర్యవేక్షకులు ఆర్ గంగాధర్, తిరుపతి, ప్రమోద్, పీహెచ్‌సీ సూపర్‌వైజర్ రుతుక్లారా, ల్యాబ్ టెక్నీషియన్ లత, పైలట్ సైదులు, ఎంపీహెచ్‌ఏ ప్రవీణ్, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...