దారుణం


Tue,November 13, 2018 12:05 AM

కెరమెరి : ఓ మైనర్ బాలికను దారుణంగా హత్య చేసిన ఘటన కెరమెరి మండల కేంద్రంలో సోమవారం కలకలం రేపుతున్నది. కెరమెరిలోని ఎస్సీ కాలనీకి చెందిన సంధ్య (15) స్థానిక జడ్పీ హైస్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నది. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో బహిర్భూమికని వెళ్లింది. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి లలిత ఆరు సమీప ప్రాంతంలోకి వెళ్లి చూడగా, శవమై కనిపించింది. సమాచారం అందుకున్న డీఎస్పీ సత్యనారాయణ, వాంకిడి సీఐ వేణుగోపాల్, ఎస్ సత్యనారారయణ ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రత్యేక పోలీసు బలగాలు సైతం రంగంలోకి దిగి, డాగ్‌స్కాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బాలిక మెడ, ముఖభాగంలో గాయలు కనిపించడంతో లైంగికదాడి చేసి, హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కగానొక్క కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు లలిత-తిరుపతి కన్నీరుమున్నీరవుతున్నారు. తల్లి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుడిని పోలీసుల అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...