నామినేషన్లకు వేళాయె..

Mon,November 12, 2018 01:21 AM

-నేటి నుంచి 19 వరకు స్వీకరణ
-20న పరిశీలన.. 22 వరకు ఉప సంహరణ
-వచ్చేనెల 7న పోలింగ్.. 11న ఓట్ల లెక్కింపు
-అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్‌లు
-అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి/ ఆసిఫాబాద్, నమ స్తే తెలంగాణ: తెలంగాణ శాసన సభ ఎన్నికలకు పోటీచేసే అభ్యర్థుల నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధి కారులు సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరిం చనున్నారు. 19 వరకు నామినేషన్‌ల స్వీకరణ, 20 వరకు పరిశీలన, 22న నామినేషన్‌ల ఉప సంహర ణ, డిసెంబర్ 7 పోలింగ్, 11న కౌంటింగ్ చేసి, ఎన్నికల ఫలితాలను విడుదల చేసేలా ఎన్నికల సం ఘం నేడు షెడ్యూల్ విడుదల చేయనుంది.

కీలక ఘట్టం
నామినేషన్ల ప్రక్రియ ఎన్నికల ప్రక్రియలో ముఖ్య మైంది. ఏ అభ్యర్థికైనా పోటీ చేయడం ఒక ఎత్తు అయితే నామినేషన్ సమర్పించడం మరో ఎత్తు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఎన్నికల సం ఘం సూచించిన వివరాలతో నామినేషన్ పత్రాల ను సంపూర్ణంగా, సమగ్ర వివరాలతో నింపి అంద జేయాలి. వివరాలు సరిగ్గా లేకపోయినా .. తప్పు లు దొర్లినా.. నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా ఎన్నికల బరిలో ని లిచే అవకాశం కోల్పోవాల్సి వస్తుంది. అందుకే నా మినేషన్ పత్రాలను పూర్తి వివరాలతో తప్పులు లే కుండా నింపాలి. సోమవారం నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా, 19వ తేదీ వరకు తుది గడువు ఉంది. 20న దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. ఉప సంహరణకు 22వ తేదీ గడువుగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నామినే షన్ ధరఖాస్తు ప్రక్రియపై కథనం...

నామినేషన్ ఇలా..
నియోజకవర్గ కేంద్రంలోని తహసీల్ కార్యాల యాల్లో నామినేషన్ పత్రాలు అందుబాటులో ఉం టాయి. పోటీ చేయాలనుకున్న అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని సరైన వివరాలతో పూర్తిగా నింపాలి. అలా గే తాను సమర్పించిన వివరాలన్నీ సరైనవేనని నో టరీ చేయించిన అఫిడవిట్(ప్రమాణపత్రం) అంద జేయాల్సి ఉంటుంది. అభ్యర్థి ఆస్తులు,అప్పుల వివరాలు, నేర చరిత్ర, ఇతర వివరాలు తెలుపుతూ ఫాం 26ను నోటరీ చేసి అందించాలి. జాతీయ లే దా రాష్ట్రీయ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థిని క నీసం ఒక్కరైనా ప్రతిపాదించాల్సి ఉంటుంది. అలా గే స్వతంత్ర అభ్యర్థికైతే పది మంది ప్రతిపాదించా ల్సి ఉంటుంది. పోటీ చేసే అభ్యర్థి తహసీల్ కార్యా లయంలో నామినేషన్ ఫీజు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు రూ. 10 వేలు, ఎస్సీ,ఎస్టీలకు రూ. 5 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన నామినేషన్ పత్రాలను గ డువులోగా నియోజకవర్గ కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.

అందుబాటులో హెల్ప్ డెస్క్..
ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్ ప త్రాలను తప్పులు లేకుండా నింపాల్సి ఉంటుంది. వివరాలు సరిగా లేకపోతే నామినేషన్‌ను తిరస్క రించే అధికారం రిటర్నింగ్ ఆధికారికి ఉంటుంది. దీంతో ఎన్నికల బరిలో నిలిచే అవకాశం కోల్పో తారు. అయితే నామినేషన్ పత్రాలు నింపడం చా లా మంది అభ్యర్థులకు ఇబ్బందిగా ఉంటుంది. క్లా జ్‌లు, సబ్‌క్లాజ్‌లు అర్థం కాని పరిస్థితి ఉంటుం ది. దీంతో నిపుణుల వద్దకు పరుగులు తీయాల్సి వచ్చే ది. కానీ ఈ సారి నామినేషన్ సమర్పించే కేం ద్రా ల వద్ద హెల్ప్ డెస్క్ ప్రారంభించనున్నట్లు ఎన్ని కల అధికారులు తెలిపారు. అభ్యర్థులకు నామినేష న్ పత్రాల్లో వివరాల నమోదుకు వారు సహకరించ నున్నారు. వారి సందేహాల నివృత్తి కోసం ఈ డెస్క్ లు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

అభ్యర్థులకు సూచనలు..
నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు వచ్చే అ భ్యర్థులకు ఎన్నికల సంఘం పలు సూచనలు చేసిం ది. నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు వచ్చే అభ్యర్థులు తమ అనుచరులను పత్రాలు సమర్పిం చే కేంద్రానికి వంద మీటర్ల దూరంలోనే నిలిపివే యాలి. అలాగే ర్యాలీలో మూడు వాహనాల కంటే ఎక్కువగా వినియోగించరాదు. ఆ వాహనాలను కూడా వంద మీటర్ల దూరంలోనే నిలిపి వేయాల్సి ఉంటుంది. అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతి ఉంటుంది. నామినే షన్ సమర్పించే గడువు తేదీల్లో ఉదయం 11 నుం చి సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే నా మినేషన్ పత్రాలు అందజేయాలి. అలాగే సెల్ ఫో న్లను అనుమతించరు.

183
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles