సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష


Mon,November 12, 2018 01:19 AM

-ఆసిఫాబాద్ అభ్యర్థి కోవ లక్ష్మి గెలుపు ఖాయం
-ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్
-జిల్లా కేంద్రంలో 200 మంది చేరిక
ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ/రెబ్బెన : సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌కు శ్రీ రామరక్ష అని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ట్రాక్టర్ ఆసోసియేషన్ సంఘం నాయకులు ఆయన సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ నియోజవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మి గెలుపు ఖాయమన్నారు. రాష్ట్రంలో మళ్లీ స్వర్ణయుగం రావాలంటే రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని విజయ శిఖరాలకు తీసుకెళ్లాలని కోరారు. అంతకుముందు గోలేటి మాజీ ఎంపీటీసీ, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కడతల మల్లయ్య టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు ఎమ్మెల్సీ పురాణం సతీశ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కడతల మల్లయ్య మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రజకుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నదన్నారు. ఈ కార్యక్రమంలో కెరమెరి జడ్పీటీసీ అబ్ధుల్ కలాం, సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, పార్టీ మండలాధ్యక్షుడు గాదెవెణి మల్లేశ్, పోటు శ్రీధర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిలువేరు వెంకన్న, పట్టణ అధ్యక్షుడు హైమాద్, ట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లేశ్, ఉపాధ్యక్షుడు స్వామి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహెమూద్, నాయకులు ప్రవీణ్ గౌడ్, రవి, సత్తన్న, రవీందర్, జకీర్, ముసీర్, సాలం, అబ్దుల్లా, నంబయ్య, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...