టీఆర్‌ఎస్ పాలనలోనే గిరిజన గ్రామాల అభివృద్ధి


Mon,November 12, 2018 01:19 AM

-జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్‌రావ్
-లింగాపూర్ మండలంలో ప్రచారం
-ఆసిఫాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మిని ఆదరించాలని పిలుపు
లింగాపూర్ : టీఆర్‌ఎస్ పాలనలోనే గిరిజన గ్రామాలు అభివృద్ధి బాటపట్టాయని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్‌రావ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మండలంలో గడప గడపకూ టీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆసిఫాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి ఎంతో కృషిచేశారనీ, మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. అంతకుముందు మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇక్కడ ఆయన మాట్లాడారు. 60 ఏండ్లు పాలించిన ప్రభుత్వాలు గిరిజన గ్రామాల అభివృద్ధిని మరిచాయన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే గిరిజనుల సంక్షేమం కోసం ఎంతో కృషిచేసిందన్నారు. సర్కారు ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. గత పాలకులు ఎక్కడ కూడా వారు చేసిన అభివృద్ధి లేదన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కొత్తగా కుమ్రం భీం పేరు మీద జిల్లాను ఏర్పాటు చేశారన్నారు. దీంతో పాటు అభివృద్ధి కోసం నూతనంగా లింగాపూర్ మండలాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. మండల ఏర్పాటులో మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఎంతో కృషిచేశారన్నారు. ఆయన వెంట వైస్ ఎంపీపీ గౌరిబాయి గన్‌పత్‌జాదవ్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు చౌహన్ బాపూరావ్, నాయకులు బోడ బాపూరావ్, ఆత్రం కిషన్, సోనేరావ్, గుణవంత్‌రావ్, సునిల్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...