విద్యార్థులు చదువులో రాణించాలి


Mon,November 12, 2018 01:19 AM

కాగజ్‌నగర్ రూరల్: విద్యార్థులు చదువులో రాణించాలని జిల్లా మైనార్టీ వెల్ఫెర్ అధికారి శ్రీనివాస్, గన్నారం మెనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కొండయ్య అన్నారు. ఆదివా రం మండలంలోని గన్నారం మైనార్టీ గురుకుల పాఠశాలలో మైనార్టీ వెల్ఫెర్, నేషనల్ ఎడ్యూకేషన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 130వ జయంతి సందర్భం గా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీ విద్యార్థులు మా రుమూల గ్రామాల నుంచి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారనీ, ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా చదువుకోని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా పాఠశాలలో అన్ని ఏర్పా ట్లు చేశామనీ, ఏదేని సమస్య ఉంటే ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. ఇష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించి, పాఠశాలకు, తల్లిదండ్ల్రకు పేరు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...