ఇక నామినేషన్ల జాతర

Sun,November 11, 2018 04:26 AM

నిర్మల్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : అక్టోబర్ 6వ తేదీన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం, సోమవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నది. అదే రోజు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు కానున్నది. రోజు 3 గంటల వరకు ఆర్‌వో కార్యాలయం లో నామినేషన్లు తీసుకుంటారు. ఇందుకు అనుగుణంగా అధికారయంత్రాంగం సమాయత్తమైంది. నో టిఫికేషన్ జారీ నుంచే నామినేషన్ల తీసుకునేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని ఐదు నియోజకవర్గా ల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి రిటర్నింగ్ అధికారులను(ఆర్‌వో) నియమించారు. రిటర్నింగ్ కార్యాలయాలకు 100 మీటర్ల దూరం వరకే వాహనాలను అనుమతిస్తారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు తీసుకోవాల్సిన చర్యలు, నామినేషన్ పత్రాన్ని పూరించాల్సిన వివరాలను అధికారులు ఇప్పటికే ప్రకటించారు. నామినేషన్ల నిశిత పరిశీలన నిమిత్తం సహాయ అధికారులను నియమించారు.l 12వ తేదీ నుంచి 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు, లేదా మూడు గంటల్లోగా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి వచ్చి ఉంటే వాటిని తీసుకుంటారు. 20న స్క్రూటిని చేస్తారు.

-22వ తేదీన ఉపసంహరణ. అదే రోజు మధ్యా హ్నం 3 గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబి తా, గుర్తులు కేటాయింపు ఉంటుంది. పోటీచేసే అభ్యర్థులకు ఓటర్ల జాబితాను అందిస్తారు.
-జనరల్ అభ్యర్థులు అయితే రూ.10 వేలు, షె డ్యూల్డ్ కులాలు/ తెగలకు సంబంధించిన అభ్యర్థులు అయితే రూ.5 వేలు డిపాజిట్ చేయాలి.
-పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలతోపాటు ఆస్తులు, అప్పులు, కేసులు, విద్యార్హతల వంటి పూర్తి వివరాలను ఫారం-26 ద్వా రా ఆర్‌వోకు అందజేయాలి. ఫారంలోని అన్ని కాలమ్స్ తప్పకుండా పూర్తి చేయాలి.
-ప్రతి అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు సమర్పించవచ్చు. డిపాజిట్ మాత్రం ఒక్కటే సరిపోతుంది. దాఖలు చేసే సమయంలో అభ్యర్థితోపాటు మరో నలుగురికి మాత్రమే రిటర్నింగ్ అధికారి వద్దకు అనుమతి ఉంటుంది. ర్యాలీలు, వాహనాలను రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 200 మీటర్ల దూరంలోనే నిలిపివేస్తారు. వంద మీటర్ల దూరం వరకు 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.
-నామినేషన్ పత్రాలు సమర్పించే అభ్యర్థులు గుర్తింపు పార్టీకి చెందిన వారు అయితే ఒక్కరు ప్రపోజ్ చేస్తే సరిపోతుంది. గుర్తింపులేని పార్టీ లు, స్వతంత్య్ర అభ్యర్థులు అయితే పది మంది ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది.

-అభ్యర్థి తమ ఎన్నికల ఖర్చును అధికారులకు పారదర్శకంగా అందజేయాలి. ఇందులో భాగం గా ఇతర లావాదేవీలతో సంబంధం లేకుండా నామినేషన్ వేయడానికి 24 గంటల ముందు ప్రారంభించిన కొత్త బ్యాంక్ ఖాతా నంబర్‌ను రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్‌వో)కు అందజేయాలి. ఇంకా బ్యాంకు పేరు, బ్రాంచ్ చిరునామా సమర్పించాలి. ఎన్నికల ఖర్చు ప్రతి పైసా ఈ బ్యాం కు ఖాతా నుంచే ఖర్చు చేయాలి. ఎట్టి పరిస్థితు ల్లో ఉమ్మడి ఖాతా తెరవద్దు. అభ్యర్థి పేరిట మా త్రమే ఖాతా ఉండాలి. తాజాగా దిగిన నాలుగు కలర్ పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, ఒకటి స్టాంపు సైజ్ ఫొటోను సమర్పించాలి. అలాగే ప్రతి ఫొటో వెనుకాల అభ్యర్థి సంతకం చేయాలి.
-నామినేషన్ పత్రాలు సమర్పించే అభ్యర్థులు తాజాగా దిగిన 4 కలర్ పాస్ పోర్టు సైజ్, ఒకటి స్టాంపు సైజ్ ఫొటో సమర్పించాలి. అలాగే ప్రతి ఫొటో వెనకాల అభ్యర్థి సంతకం చేయాలి.
-పోటీచేసే అభ్యర్థులు బ్యాలెట్‌పై తమ పేరు ఎలా ఉండాలనేది ముందుగానే రాసి ఇవ్వాలి.
-బ్యాలెట్‌లో ముందుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, తదుపరి గుర్తింపులేని రాజకీయ పార్టీలు, తదుపరి స్వతంత్య్ర అభ్యర్థుల పేర్లను అక్షర మాల క్రమంలో కేటాయిస్తారు.
-ఎన్నికల కమిషన్ సవరించిన నిబంధనల ప్రకా రం.. అభ్యర్థులు ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయవచ్చనే అంశంపై స్పష్టత ఇచ్చింది. దీని ప్రకారం ఒక అభ్యర్థి గరిష్టంగా రెండు నియోజకవర్గాల నుంచి మాత్రమే పోటీ చేయచ్చు.

-అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఉండాల్సిన అర్హత లు, అనర్హతలపై ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951 లోని 3వ అధ్యాయం 11వ అధికరణం ద్వారా వివరించారు. దీని ప్రకారం అభ్యర్థులు తప్పనిసరిగా భారత పౌరులై ఉండాలి. 25 ఏళ్లు దాటి న వారికే అవకాశం కల్పించారు. పోటీ చేసే రిజర్వు స్థానం అయితే అర్హతలు కలిగి ఉండాలి.
-ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఏదైనా రాజకీయ పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లుయితే అందు కు గుర్తింపుగా వారు ఇచ్చే బీ ఫారం అందజేయాలి. బీ ఫారంను నామినేషన్‌తోపాటు ఇవ్వకున్నా నామినేషన్ల ఆఖరు తేదీ మధ్యాహ్నం 3 గంటలలోగా ఇవ్వొచ్చు. పోటీ చేస్తున్న అభ్యర్థి నియోజకవర్గానికి చెందిన వారు కాకుంటే సొం త నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల జాబితాలో పేరు, ఇతర వివరాలు తెలియజేయాలి.

అభ్యర్థులు గమనించాల్సిన అంశాలు..
గతంలో చిన్న చిన్న తప్పుల వల్ల అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణకు గురైన సందర్భాలున్నాయి. అందుకే నామినేషన్ దాఖలు చేసేటప్పు డు అత్యంత జాగ్రత్త వ్యవహరించాలి. గతంతో పోలిస్తే ఈ సారి అఫిడవిట్‌లో అనేక మార్పులు చేశారు. ఈ విషయాన్ని అధికారులు ఇప్పటికే ప్ర కటించారు. ప్రతి అభ్యర్థి లేదా అతని తరఫున పూరించే నామినేషన్ దాఖలు చేసే వాళ్లు నిశితం గా అన్ని వివరాలను పూర్తిగా చదివి నింపాలి. ఏ మాత్రం పొరపాటు చేసినా లేదా అసంపూర్తిగా వివరాలిచ్చినా సదరు నామినేషన్ స్క్రూటినిలో తిరస్కరణకు గురయ్యే ప్రమాదముంటుంది.
ఎన్నికల సిబ్బంది రెడీ

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు అధికారయంత్రాంగం ప్రత్యేక సిబ్బందిని నియమించింది. జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూ ర్ నియోజకవర్గాలవారీగా సిబ్బందిని కేటా యించారు. జిల్లాలో 532 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నోడల్ అధికారులు 23 మం ది, ఇద్దరు రిటర్నింగ్ అధికారులు, 70 మంది సెక్టోరల్ అధికారులను నియమించారు. పోలీస్ సిబ్బంది 2000 మంది.

157
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles