మీ సేవకుడిగా ఉంటా

Sun,November 11, 2018 04:25 AM

కౌటాల : ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసి మరోసారి అవకాశమివ్వండి.. రాత్రింబవళ్లు వెన్నంటి ఉండి.. మీకు సేవలందిస్త్తా అని సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప హామీ ఇచ్చారు. శనివారం కౌటాల మండలం కుంబారి గ్రా మంలో శనివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆ యన పాల్గొని మాట్లాడారు. ఇంతకుముందు ఎన్నడు మీ కష్టాలను చూడని కొందరు నాయకులు ఓట్ల కోసం వస్తు న్నా రనీ, అలాంటి వారికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. గ్రామానికి వచ్చేందుకు కనీసం రోడ్డు లేని దుస్థితి, తాగేందుకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో తాను వెంటనే బోరువెల్‌లు వేయించానని గుర్తుచేశారు. పాల్వాయి హరీశ్‌బాబు తండ్రి పేరు చెప్పుకుని ఓట్లు అడుగుతున్నాడనీ, వారు ఇంతకుముందు చేసిన అభివృద్ధి ఏంటో చూపాల న్నా రు. తాను నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఏ ఆపద వచ్చిన తోడుంటానన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతటి అభివృద్ధి జరిగిందో మీరే చూస్తున్నారనీ, మనం ఇంకా అభివృద్ధి చెందాలంటే మళ్లీ కారు గుర్తుకు ఓటు వేసి తనకు గెలిపి స్తే మీ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన టేకం శ్రీనివాస్ అనే గిరిజన యువకుడు నామినేషన్ ఖర్చుల కోసం కోనప్పకు రూ. 1116 లను అందచేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ డుబ్బుల నానయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ బసార్కర్ విశ్వనాథ్, ఐటీడీఏ డైరెక్టర్ కుమ్రం మాంతయ్య, మాజీ సర్పంచులు దౌలత్, సత్యనారాయణ, నాయకులు గుజ్జ రమేశ్, ధోని అంజయ్య, పసూనూరి తిరుపతి, డబ్బా బాపు, బిట్టుపల్లి సంతోష్, రవీందర్ గౌడ్, తాజ్, ప్రభాకర్ గౌడ్ మండల నాయకులున్నారు.

149
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles