సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం

Sun,November 11, 2018 04:24 AM

-ఆసిఫాబాద్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి
-కెరమెరి మండలానికి చెందిన 250 మంది గులాబీ పార్టీలో చేరిక
-గ్రామాల్లో కొనసాగుతున్న టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల ప్రచారం
ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని ఆసిఫాబాద్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆమె ని వాసంలో కెరమెరి మండలం మిట్టపిప్పిరి గ్రామానికి చెం దిన కుమ్రం భీమ్ యువజన సంఘం అధ్యక్షుడు మె స్రం శేకు, పరమేశ్వరి, రఘునాథ్, జైవంత్, వాంకిడి మం డలంలోని బంబారకు చెందిన చంద్రశేఖర్, రవి, శంకర్, ఆసిఫాబాద్ మండలంలోని గుడ్డెన్‌ఘట్‌కు చెందిన రమేశ్‌తో పాటు వివిధ గ్రామలకు చెందిన దాదాపుగా 250 మందికి పైగా టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి కోవలక్ష్మి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కో వలక్ష్మి మాట్లాడుతూ ప్రజల పక్షాన ఉండే ఏకైక పార్టీ టీ ఆర్‌ఎస్ మాత్రమేనన్నారు. అధికారంలోకి వచ్చిన నా లు గేళ్లలోనే ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిలువేరు వెంకన్న, ఆసిఫాబాద్, వాంకిడి మండలాల పా ర్టీ ఆధ్యక్షులు గాదెవెణి మల్లేశ్, అజయ్ కుమార్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహెముద్, నాయకులు ప్రవీణ్ గౌ డ్, మద్దెల శ్రీధర్, మహేష్, గోపాల్, కృష్ణాజీ, మహేశ్ త దితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో జోరుగా ప్రచారం
నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తున్న కోవలక్ష్మిని గెలిపించాలని టీఆర్‌ఎస్ పార్టీ మై నార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహమూద్ ప్రజలను కోరా రు. శనివారం జిల్లా కేంద్రంలోని ఉస్మానియా మాజీద్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నాలుగేండ్లలో చేపట్టిన సంక్షేమ,అభివృద్ధి పథకాలను వివరించారు. విద్య,వైద్యం, తాగునీరు, మౌలిక వసతుల కల్పనకు ఆమె ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు హైమాద్‌బిన్ అబ్దుల్లా, సింగల్ విండో చైర్మన్ అలీబిన్ హైమాద్, నాయకులు అబ్దుల్లా, నాయకులు ముసీర్, మోతే రాజన్న, తాజ్ తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన: టీఆర్‌ఎస్ పార్టీ తోనే గ్రామాలాభివృద్ది సాధ్య మని టీఆర్‌ఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి చెన్న సోమశేఖర్, ఎన్నికల కమిటీ సభ్యుడు మోడెం సుదర్శన్‌గౌడ్ స్పష్టం చేశారు. రెబ్బెన మండలంలోని గొల్లగూడ గ్రామంలో శనివారం టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారాన్ని నాయకులు నిర్వహించారు. గ్రామస్తులను కలిసి, టీఆర్‌ఎస్ సర్కారు అ మలు చేసిన పథకాలు వివరించారు.

కారు గుర్తుకు ఓటు వేసి కోవ లక్ష్మిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో డైరెక్టర్ పెసరి మధునయ్య, ఎన్నికల కమిటీ సభ్యులు మాణిక్యాలరావు, స్థాని క నాయకులు చౌదరి నాగయ్య, శంకర్, మనోహర్, పాప య్య, తదితరులున్నారు.
జైనూర్: టీఆర్‌ఎస్ అభ్యర్థి కోవలక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లా లా అన్నారు. మండలంలోని మాని ఝెండాగూడా, కొ లాం గూడా గ్రామాల్లో శనివారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్, నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి కృషిచేశారని తెలిపారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కోవలక్ష్మిని భారీ మెజా ర్టీతో గెలిపించాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రా మానికి చెందిన యువజన సంఘం సభ్యులతో పాటు పలువురు పార్టిలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యుడు సుబుర్‌ఖాన్, ఎంపీటీసీ భగవంత్‌రా వ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గెడాం లక్ష్మణ్, కినక యాదవ్‌రావ్, మాజీ సర్పంచులు మెస్రం గోవింద్‌రావ్, మడా వి భీంరావ్, మెస్రం లక్ష్మణ్, అర్జున్, నాయకులు లట్పటె మహాదేవ్, మూసా, జాకీర్, లక్ష్మణ్ తదితరులున్నారు.

134
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles