నామినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి

Sun,November 11, 2018 04:24 AM

-12 నుంచి 19 వరకు అవకాశం
-ఎన్నికల రిటర్నింగ్ అధికారి శివకుమార్
-భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించిన డీఎస్పీ సాంబయ్య
సిర్పూర్(టి): సిర్పూర్ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శివకుమార్ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. నామినేషన్ ప్రక్రియ 12 నుంచి 19వ తేదీ వరకు కొనసాగుతుంద ని ఆయన తెలిపారు. నామినేషన్ కార్యక్రమం ఉద యం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉం టుందన్నారు. ఈ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తామని చెప్పారు.
ప్రతి ఒక్కరూ సహకరించాలి
నామినేషన్‌ల స్వీకరణ ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కాగజ్‌నగర్ డీఎస్పీ సాంబయ్య కోరా రు. తహసీల్దార్ కార్యాలయంలో భద్రతా ఏర్పాట్లను సిర్పూర్(టి) రిటర్నింగ్ అధికారి శివకుమార్‌తో కలసి పరిశీలించారు. ఆనంతరం మాట్లాడుతు నామినేషన్ కేంద్రం చుట్టూ వంద మీటర్ల దూరం నుంచి బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగు దిక్కులా బారికేడ్లు ఏర్పాటు చేసి ఉలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు పుర్తి చేశామన్నారు. కార్యాలయం చుట్టూ 100 మీటర్ల వరకు పరిశీలించారు. ఆయన వెంట కౌటాల సీఐ మోహన్, తహసీల్దార్ భోజన్న, సిర్పూర్(టి) ఎస్‌ఐ నీలం రవి, డిప్యూ టీ తహసీల్దార్ రామునాయక్, ఆర్‌ఐ లలిత, పోలీస్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

123
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles