ప్రభుత్వ పథకాలే మళ్లీ గెలిపిస్తాయి..

Tue,November 6, 2018 11:20 PM

-ప్రజలందరూ టీఆర్‌ఎస్ వెంటే
-సిర్పూర్, ఆసిఫాబాద్ అభ్యర్థులు కోనప్ప, కోవ లక్ష్మి
-సార్సాల, జంగాం, దుబ్బగూడలో వేర్వేరుగా ప్రచారం

కాగజ్‌నగర్ రూరల్: ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపిస్తాయనీ, ప్రజలందరూ ఎప్పుడూ తమ వెంటే ఉంటారని సిర్పూర్, ఆసిఫాబాద్ అభ్యర్థులు కోనేరు కోనప్ప, కోవ లక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం కాగజ్‌నగర్ మండలం సార్సాలలో కోనేరు కోనప్ప ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించగా, జైనూర్ మండలం జంగాం, దుబ్బగూడలో కోవ లక్ష్మి ప్రచారం చేశారు. ఈ నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేశామనీ, మరోసారి ఆశీర్వదిస్తే మరింత మేలు చేస్తామన్నారు.

నాలుగేళ్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే తనను మళ్లీ గెలిపిస్తాయని సిర్పూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి కోనేరు కో నప్ప అన్నారు. మంగళవారం కాగజ్‌నగర్ మండలంలోని సార్సాల గ్రా మంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని మా ట్లాడారు. ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపే ఉన్నారనీ, అభివృద్ధే వారు కోరుకుం టున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు రోడ్లు, వంతెనల నిర్మాణాలు, మౌలిక సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు. నియోజకవర్గ విద్యార్థులు చదువులో ముందుండాలని 52 డిజిటల్ టీవీలను అందించామనీ, 29వేల మంది విద్యార్థులకు స్పోకెన్ ఇం గ్లిష్ పుస్తకాలను అందజేసినట్లు చెప్పారు. రక్తహీనతతో బాధపడుతున్న 1200 మందికి పౌష్ఠికాహార కిట్లను అందజేయనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 36 మంది రైతు కుటుంబాలకు రైతు బీమా చెక్కును అందజేసినట్లు తెలిపారు. ఎన్నికలు వచ్చాయనీ, కొందరు ఓట్ల కోసం వస్తున్నారనీ, వారి మాటలకు నమ్మి మోసపోవద్దన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు గజ్జివాసుదేవ్, ఉమాకాంత్, సంతోష్ గ్రామస్తులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లో చేరికలు
కాగజ్‌నగర్ రూరల్/కౌటాల: మండలంలోని గన్నారం, అనుకోడ గ్రామా నికి చెందిన 150 మంది గ్రామస్తులు మంగళవారం టీఆర్‌ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కౌటాల మండ లంలో మంగళవారం కౌటి గ్రామానికి చెందిన 50 మంది టీఆర్‌ఎస్ పార్టీ లో చేరారు. అభివృద్ధిని చూపి స్వచ్ఛందంగా పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు. ఈ చేరికల్లో జడ్పీటీసీ మౌల్‌కార్ లక్ష్మణ్, నాయకులు కోనేరు కృష్ణారావు, మాజీద్, కౌటాలలో జడ్పీటీసీ డుబ్బుల నానయ్య, రైతు సమ న్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ బసార్కర్ విశ్వనాథ్, నాయకులు రవీంద ర్ గౌడ్, గట్టయ్య, సంతోష్, రాంచందర్, మండల నాయకులున్నారు.

మళ్లీ గెలిపిస్తే.. మరింత అభివృద్ధి:ఆసిఫాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి
జైనూర్: తనను మరోసారి గెలిసిస్తే నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధ్ది ప రుస్తానని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మి అన్నారు. మండలంలోని జం గాం గ్రామంలో మంగళవారం వారపు సంతలో కోవలక్ష్మి కూరగాయ లు అమ్ముతూ ప్రచారం చేశారు. అనంతరం మండలంలోని దుబ్బగూడా గ్రామంలో ఇంటింటా తిరుగుతూ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోవలక్ష్మి మాట్లాడుతూ నాలుగున్నరేండ్లలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టానని పేర్కొన్నారు. మరోసారి తనను ఆశీర్వదిస్తే.. ప్రజలకు అందుబాటులో ఉంటూ మరిన్ని సేవలందిస్తానన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్‌రావ్, , రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాలా, సహకార సంఘం చైర్మన్ జాహెద్‌ఖా న్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుమ్ర భగవంత్‌రావ్, ఎంపీటీసీ భగవంత్‌రావ్, మాజీ సర్పంచ్ మడావి భీంరావ్, పెందుర్ అర్జున్, గోవింద్‌రావ్, సంఘం నాయకులు నాయకులు లట్పటె మహాదేవ్, జాకీర్, మూసా తదితరులున్నారు.

140
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles