సబ్బండ వర్గాల సంతోషం


Tue,November 6, 2018 11:17 PM

కాగజ్‌నగర్ టౌన్: తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేండ్లలోనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టి లబ్ధిదారులకు అందేలా చేసింది. మ్యానిఫెస్టోలో ఇచ్చిన పథకాలే కాకుండా రైతుబంధు, రైతు బీమా , తదితర పథకాలతో ప్రజలకు, రైతులకు అండగా నిలిచింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాల వలన దాదాపు ప్రతీ కుటుంబం లబ్ధిపొందింది. నియోజకవర్గంలో 493 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్‌చెక్కు రూ.6 కోట్ల 78లక్షల 28వేల 790లను అందజేసింది. అసరా పింఛన్లు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు 33100 మందికి రూ. 3,75,99, 500 ఇచ్చింది. గొల్లకుర్మలను ఆర్థికంగా ఆదుకునేందుకు 2499 మంది లబ్ధిదారులకు 52479 గొర్రెలను పంపిణీ చేసింది. పేదింటి ఆడబిడ్డల పెండ్లి కానుకగా కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద కల్యాణ లక్ష్మి పథకం కింద 2617 మంది లబ్ధిదారులకు రూ.99127636 , షాదీముబారక్ పథకం కిద 4999 మంది లబ్ధిదారులకు రూ. 33195160 అందజేసింది.

అంతేగాకుండా సర్కారు దవాఖానల్లో ప్రసవాలు పెరిగేలా కేసీఆర్ కిట్ పథకం ప్రవేశ పెట్టడంతో 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటివరకు 4477 మంది లబ్ధిదారులు కేసీఆర్ కిట్లను అందుకున్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు పథకం ద్వారా 50263 రైతులకు రూ. 61,38,41,060 చెక్కులను అందజేశారు. దీనికితోడూ రైతు బీమా పథకం ద్వారా ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఒక్కో రైతుకు రూ.5 లక్షల బీమా 36 మందికి రూ. 1కోటి 80 లక్షలను అందజేసింది. నాలుగేండ్లలో నియోజకవర్గంలోని 3607 మంది రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను అందించి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. 200 మందికి సబ్సిడీ ట్రాక్టర్లను అందించారు. గత పాలకుల హయంలో తమను ఎవ రూ పట్టించుకోలేదనీ, స్వరాష్ట్రంలో తెలం గాణ ప్రభుత్వం సబ్బండ వర్గాలకు అండగా నిలిచి ఆదుకున్నదని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా మళ్లీ సీఎం కేసీఆర్ కావాలనే కోరుకుంటున్నారు.

133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...