సంప్రదాయబద్ధంగా భీం వర్ధంతి


Wed,October 17, 2018 01:53 AM

-సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలు
-హట్టి నుంచి ప్రత్యేక బస్సులు
-ఐటీడీఏ చైర్మన్ లక్కేరావ్
-డీఎస్పీ సత్యనారాయణతో కలిసి జోడెఘాట్ సందర్శన
కెరమెరి: జల్, జంగల్, జమీన్ ని నాదంతో ఉద్య మించిన పోరాటవీరు డు కుమ్రం భీం వర్ధంతిని సంప్ర దాయబద్దంగా నిర్వహించనున్నట్లు ఐటీ డీఏ చైర్మన్ కనక లక్కేరావ్ పేర్కొన్నారు. మంగళవారం ఆసిఫా బాద్ డీఎ స్పీ సత్యనారాయణతో కలిసి జోడేఘా ట్‌ను సందర్శించారు. ఈ నెల 24న ని ర్వహించనున్న భీమ్ 78వ వర్ధంతి సభకు ఏర్పాటు పనులను సమీక్షించా రు. సభకు వచ్చే ప్రజలకు ఆటంకం ఏర్పడకుండా ఆరీ సీ బస్సు పార్కింగ్, వీఐపీల పార్కింగ్‌లతో పాటు భో జన వసతి, సభవేదిక స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ మా ట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు, అభిమానులు తరలిరానుండడంతో హట్టి నుంచి జోడేఘాట్ వరకు ప్రత్యేక బస్సు సౌక ర్యం క ల్పిస్తామన్నారు. ఎలాంటి లోటు ఏర్పడకుండా చూడా లని డీటీడీవో సూచించారు. సభాప్రాంగణం, భోజన శాల వద్ద తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. 23న రాత్రి అవ్వల్‌పేన్ పూజా అనంతరం మ రుసటి రోజు భీమ్ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివాసీల ఆ చార వ్యవహరాలతో ఘనంగా జరుపుకునేందుకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా సభావే దికలో ప్రసంగాలకు బదులుగా సంస్కృతి సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చైర్మన్ స్పష్టం చేశారు. జిల్లా కళాకారులే కాకుండా ఇతర రాష్ర్టాల్లోని 9 ఆది వాసీ తెగలతో సంస్కృతి ఉట్టిపడేలా ప్రదర్శించను న్నట్లు ఆయన చెప్పారు. డీటీడీవో దిలీప్‌కుమార్, ఆర్ అండ్‌బీ డీఈ రాము, ఏటీడబ్లువో చంద్రమోహన్, జై నూర్ సీఐ సాదిక్‌పాషా, ఎంఆర్‌ఐ వెంకట్‌రావ్, అసి స్టెంట్ క్యూరేటర్ మంగం విశ్వంరావ్, ఉత్సవ కమిటీ చైర్మన్ పేందోర్ మోహన్‌రావ్, కన్వీనర్ రఘునాథ్, ఆదివాసీ నాయకులు కుమ్రం మాదోరావ్, ఆత్రం భొజ్జీరావ్, చందన్‌షా, సోములతో పాటు ఆయా శాఖ ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...