22 నుంచి కుష్టు వ్యాధి గుర్తింపు

Sun,October 14, 2018 02:11 AM

-జిల్లాలో 14 రోజుల పాటు కార్యక్రమం
-ప్రతి రోజూ 20 ఇళ్లలో సర్వే
-డీఎంహెచ్‌వో సుబ్బారాయుడు
ఆసిఫాబాద్ రూరల్ : జాతీయ కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 22 నుం చి వచ్చే నెల 4 వరకు జిల్లావ్యాప్తంగా కుష్టు వ్యా ధి నిర్ధారణ సర్వే చేపట్టనున్నట్లు జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు పేర్కొన్నారు. శనివారం జిల్లా వైద్యాశాఖ కార్యాలయంలో జిల్లాలోని వై ద్యాధికారులు, ఆరోగ్య పర్యవేక్షకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూ చనలు చేశారు. 14 రోజలు పాటు సర్వే కొనసాగుతుందన్నారు. ఆశ కార్యకర్త , స్వచ్ఛంద కార్యకర్తతో కలిసి బృందంగా ఏర్పడి రోజూ ఒక గ్రామంలోని 20 ఇండ్లలో సర్వే చేయాలన్నారు. వైద్యాధికారులు తమతమ పీహెచ్‌సీల పరిధిలో ఎన్ని బృందాలు అవసరమవుతాయో గుర్తించి ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ బృందాలకు మండల స్థాయిలో శిక్షణ ఇచ్చి కుష్టు వ్యాధి గ్ర స్తులను గుర్తించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, డివిజనల్ పారామెడికల్ అధికారి రాజ్‌వీరు, కాగజ్‌నగర్ డిప్యూటీ డీఎంహెచ్‌వో సునీల్ రావు , జిల్లాలోని వైద్యాధికారులు , ఆరోగ్య పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.

124
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles