కాగజ్‌నగర్ ఆర్డీవో శివకుమార్


Sun,October 14, 2018 02:10 AM

బెజ్జూర్ : ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నదనీ, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా ఎన్నికల నియమావళి పాటించాలని కాగజ్‌నగర్ ఆర్డీవో శివకుమార్ అన్నారు. శనివారం మండలంలోని పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ స్థలాల్లో పార్టీ జెండాలతో పాటు బ్యానర్లు, ప్లెక్సీలు, కటౌట్‌లను తొలగించాలన్నారు. సభలు, సమావేశాలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. మైక్, లౌడ్ స్పీకర్లు వాడవద్దన్నారు. వీటి పర్యవేక్షణకు వీడియో టీంలను ఏర్పాటు చేశామనీ, ఈ టీంలు తిరుగుతున్నాయని చెప్పారు. అంతేగాకుండా నాలుగు ఫ్లయింగ్ స్కాడ్, నాలుగు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ప్రసంగాలు, కుల, మత, తదితర రెచ్చగొట్టె పోస్టులు చేయవద్దని సూచించారు. గతంలో చేపట్టిన అభివృద్ధి పనుల తప్పా కొత్తగా ఎలాంటి పనులు చేపట్టరాదన్నారు. అంతకు ముందు మండలంలోని కాటెపల్లి, ముంజంపల్లి, బారెగూడ, రెబ్బెన, మర్తిడి, సలుగుపల్లి, తలాయి, తదితర మొత్తం 25 పోలింగ్ బూతులను పరిశీలించామ న్నారు. ఆయా బూత్‌ల్లో విద్యుత్, మరుగుదొడ్లు, వృద్ధులు వచ్చేందుకు ర్యాంపులు తదితర సౌకర్యాలు ఏర్పాటకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రాణహిత పరిసర కేంద్రాలను పరిశీలించి గూడెం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును పరిశీలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట తహసీల్దార్ రఘునాథ్ రావ్ , వీఆర్వో శ్రీనివాస్, బీఎల్‌వోలు, వీఆర్‌ఏ సిబ్బంది ఉన్నారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...