విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి

Fri,October 12, 2018 11:39 PM

సీసీసీ నస్పూర్ : వ్యవసాయ రంగానికి ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 24 గంటల విద్యు త్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎన్‌పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు విద్యుత్ అధికారులను ఆదేశించారు. సీసీసీ సింగరేణి అతిథి గృహంలోని స మావేశ మందిరంలో శుక్రవారం మంచిర్యాల, ని ర్మల్, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల విద్యుత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. విద్యుత్‌రంగ సమస్యలు, అధికారుల పనితీరు, రైతుల కు 24గంటల విద్యుత్, పెండింగ్ బకాయిలు, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, కొత్త లైన్ల ఏర్పాటు, సబ్‌స్టేషన్ల నిర్మాణం, బిల్లు వసూళ్లు, తదితర అంశాలపై సమీక్షించారు. ఉమ్మడి జిల్లాలో నెలకొ న్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. దానిని అధిగమించేందుకు సమస్య ఉన్న చోట కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు దరఖాస్తు చేసుకున్న వెంటనే కనెక్షన్లు ఇవ్వాలన్నారు. బిల్లుల వసూళ్లులో పురోగతి సాధించాలన్నారు. ఈ సందర్భంగా సీఎండీ గోపాల్‌రావు మాట్లాడుతూ.. ప్రజలకు విద్యుత్ అంతరాయం లేకుం డా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వ్యవసా య రంగానికి 24 గంటల విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తున్నామనీ, సమస్యలు ఉన్న చోట వెంటనే పరిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో సీజీఎం నగేశ్, ఆదిలాబాద్ ఎస్‌ఈ చౌహాన్, నిర్మల్ ఎస్‌ఈ జాడి ఉత్తమ్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్‌ఈ రమేశ్‌బాబు, విజిలెన్స్ సీఐ శ్రీనివాస్, ఉమ్మడి జిల్లాలోని ఈఈలు, డీఈలు, ఏడీలు, ఏఓలు, ఏఏఓలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.

125
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles