క్రీడల్లోనూ రాణించాలి

Wed,October 10, 2018 11:57 PM

- టీజీవో జిల్లా అధ్యక్షుడు అజ్మీర శ్యాంనాయక్
- ఉమ్మడి జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు ప్రారంభం
ఆదిలాబాద్ టౌన్ : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిం చాలనీ, ఇందుకు తల్లిదండ్రుల ప్రోత్సా హం ఎంతో అవసరమని టీజీవో జిల్లా అధ్యక్షుడు అజ్మీర శ్యాంనాయక్ పేర్కొ న్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-14 సాఫ్ట్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పాత పది జిల్లాల నుంచి బాల బాలికలు 320 మంది పాల్గొన్నారు. అంతకు ముందు విద్యార్థులు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించగా, జ్యోతి ప్రజ్వన చేసి క్రీడలను ప్రారంభించారు. అనంతరం సముద్రాల మాదవి, మిట్టురవి మాస్టర్ విద్యార్థులు కుచి, భరతనాట్యం నృత్యాలు పలువురిని అలరించాయి. ఈ సందర్భంగా క్రీడా కారులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడల వల్ల విద్యార్థులు శరీర దారుఢ్యం పెంపొందించుకోవడంతో పాటు మేథోశక్తి పెరుగుతుందన్నారు. గతంలో పాఠశాల స్థాయిలో ఎక్కువ శాతం క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చే వారనీ, ప్రస్తుతం ఈ పోటీ ప్రపంచంలో ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ క్రీడా పోటీల్లో గెలుపొంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కోరారు. సాఫ్ట్‌బాల్ 16వ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరుపడం అభినందనీయం అన్నారు.

ఉమ్మడి జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థశారథి సారథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రం క్రీడలకు నిలయంగా మారిందని ఆయన చేసిన కృషి ఫలితంగానే జిల్లా కేంద్రంలో అనేక క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుల సమిష్టి కృషి ఫలితంగా జిల్లాలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత లభిస్తోందని అన్నారు. ఈ మూడు రోజుల పాటు జరిగే సాఫ్ట్‌బాల్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి క్రీడా పోటీలను సజావుగా నిర్వహించేందుకు వ్యాయామ ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసుల శాఖ క్రీడల అధికారి వెంకటేశ్వర్లు, డీఈవో ఏవో సుధాకర్‌యాదవ్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా గిరిజన క్రీడల అధికారి పొరెడ్డి పార్థశారథి, రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ క్రీడా పోటీలు పర్యవేక్షకులు పాషా, బండిరవి, పాఠశాల క్రీడా సమాఖ్య రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గంగామోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల శ్రీనివాస్, పేట సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి హరిచరణ్, పీఈటీలు స్వామి, గంగాధర్ పాల్గొన్నారు.

148
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles