గులాబీ జోష్

Wed,October 10, 2018 01:41 AM

-కైర్‌గూడ ఓసీపీలో టీబీజీకేఎస్ గేట్ మీటింగ్
-హాజరైన ఎమ్మెల్సీ పురాణం, ఎమ్మెల్యే అభ్యర్థులు
-కోవ లక్ష్మి, దుర్గం చిన్నయ్య
-కాగజ్‌నగర్‌లో కార్యకర్తలు, వ్యాపారస్తులతోవేర్వేరుగా సమావేశమైన కోనప్ప
రెబ్బెన/కాగజ్‌నగర్‌టౌన్: ఆర్‌ఎస్ దూకుడు పెంచింది. మిగతా పార్టీల కంటే ముందుగానే ప్రచారం ప్రారంభించి, టాప్‌గేర్‌లో దూసుకపోతున్నది. ఆయాచోట్ల ప్రజానీకం అనుకూల ప్రకటనలతో మద్దతు తెలుపుతున్నది. కాగా, మంగళవారం కాగజ్‌నగర్ పట్టణంలోని 14వ వార్డులో కౌన్సిలర్ వైద్య సురేఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో సిర్పూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప పాల్గొన్నారు. మూతబడిన ఎస్పీఎంను తెరిపించి, కార్మికుల కుటుంబాల్లో టీఆర్‌ఎస్ సర్కారు వెలుగులు నింపిందన్నారు. అనంతరం వార్డు కౌన్సిలర్ సరేఖ బాలు దంపతులు నామినేషన్ ఖర్చులకు గాను రూ.5,001 విరాళంగా అందజేశారు.

బెల్లంపల్లి ఏరియాలోని కైర్‌గూడ ఓసీపీలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గేట్‌మీటింగ్ నిర్వహించారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థులు కోవ లక్ష్మి, దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్యే పురాణం సతీశ్‌కుమార్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి పాల్గొన్నారు. మహాకూటమి మాటలు నమ్మి మోసపోవద్దనీ, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కార్మికులను కోరారు. శ్రీరాంపూర్‌లోని ఆర్కే-7 గనిపై టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్‌తో కలిసి మంచిర్యాల టీఆర్‌ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు కార్మికులతో సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పిప్పల్‌ధరి, మామిడిగూడ, జమ్ముల్‌ధరి, లింగుగూడ, దార్‌లొద్ది, వాన్‌వాట్ గ్రామాల్లో మంత్రి జోగు రామన్న, నిర్మల్ జిల్లా ఇంద్రవెల్లి మండలం లాల్‌టేకిడి, వాగాయితండా, సక్కారాంతండాల్లో ఖానాపూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

106
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles