నేటి నుంచి శరన్నవరాత్రోత్సవాలు

Wed,October 10, 2018 01:33 AM

బెజ్జూర్ : మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో బుధవారం నుంచి దేవీ నవ రాత్రుల ఉత్సవాలకు మండపాలు ముస్తాబ య్యా యి. మండల కేంద్రంలో రంగనాయక ఆలయ ప్రాంగణంలో, మన్నెవాడలో, బారె వాడతో పాటు గొల్లవాడలో మండపాల్లో అందంగా తీర్చిదిద్దారు.
సిర్పూర్(టి): మండల కేంద్రంలోని వేంకటేశ్వర ఆలయంలో బుధవారం నుంచి ఈ నెల 18 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ దహెగాం వామన్‌దాదా మం గళవారం ప్రకటనలో తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రతి రోజు మధ్యా హ్నం నుంచి అన్నదానం, సాయంత్రం కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలను సిర్పూర్(టి) హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యం లో నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
కౌటాల : మండల సరిహద్దు మహారాష్ట్రలోని ధరూర్ స్వయంబు శ్రీ త్రిదేవి అమ్మవారి ఆలయంలో బుధవారం నుంచి నవరాత్రులను పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి శ్రీ ప్రమోద్ మహారాజ్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. రోజూ ఉదయం 9 గంటలకు మహా హోమ యజ్ఞం, సాయంత్రం భజన కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. రోజూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ, మహారాష్ట్రలోని భక్తులు అధిక సంఖ్యలో పా ల్గొని అమ్మవారి దీవెనలకు పాత్రులు కాగలరని ఆయన కోరారు.

102
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles