కారు.. జోరు

Mon,October 8, 2018 11:21 PM

-పల్లెల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారం
-తిర్యాణి, సిర్పూర్(యు)లో కోవ లక్ష్మి, సిర్పూర్(టి)లో కోనేరు కోనప్ప
-ఊరూరా బ్రహ్మరథం పడుతున్న ప్రజానీకం
-పార్టీలో భారీ చేరికలు
- తిర్యాణి/ సిర్పూర్(యు/ సిర్పూర్(టి)/కౌటాల/బెల్లంపల్లి, నమస్తే తెలంగాణ : ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో జిల్లాలో జోష్ పెరిగింది. ఇప్పటికే ఊపు మీదున్న టీఆర్‌ఎస్, టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్నది. సోమవారం అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. సిర్పూర్(టి) మండలంలోని చింతకుంట, హీరాపూర్‌లో సిర్పూర్ అభ్యర్థి కోనేరు కోనప్ప పర్యటించారు. ఇంటింటా తిరుగుతూ ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు తిలకం దిద్దారు. మంగళహారతులు, బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. నామినేషన్ ఖర్చుల కోసం హీరాపూర్ గ్రామ మహిళలు రూ.1001 విరాళంగా అందజేశారు. కౌటాల మండల కేంద్రంలోని ఆయన నివాసంలో చింతలమానేపల్లి మండలం రణవెల్లి గ్రామానికి చెందిన 30 మంది పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. తిర్యాణి మండలంలోని లింగిగూడ, గంభీరావుపేట, ఏదులపాడ్, గిన్నేధరి, రాంబాయిగూడల్లో ఆసిఫాబాద్ అభ్యర్థి కోవ లక్ష్మి విస్తృతంగా పర్యటించారు. గ్రామగ్రామాన పార్టీ జెండాలు ఎగరేశారు. సి ర్పూర్(యు) మండలం పంగిడిమాదర గ్రామ పంచాయతీ పరిధిలోని సీతాగొందిలో ప్రచారం చేశా రు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలీ భవనంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమా ర్, బెల్లంపల్లి అభ్యర్థి దుర్గం చిన్నయ్య పార్టీ నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. స్థానిక శాంతిఖనిలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్‌తో కలిసి దుర్గం చిన్నయ్య, జన్నారం మండలం బాదంపెల్లి, కిష్టాపూర్ గ్రామాల్లో ఖానాపూర్ అభ్యర్థి అజ్మీరా రేఖానాయక్ ప్రచారం నిర్వహించారు.

110
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles