జై టీఆర్‌ఎస్


Thu,September 20, 2018 12:12 AM

-కారు గుర్తుకే ఓటు వేస్తామంటూ భీం వారసుల నిర్ణయం
-పెద్దదోభలో ఎమ్మెల్సీ పురాణం, కోవ లక్ష్మి, భీం మనుమడు
-సోనెరావు సమక్షంలో గ్రామస్తుల ప్రకటన
-దహెగాంలో కోనప్ప భారీ సభ.. పార్టీలో 500 మంది చేరిక
మళ్లీ ఆశీర్వదించండి.. : సిర్పూర్ అభ్యర్థి కోనప్ప

దహెగాం : నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడి పనిచేసినందుకే ప్రజల ఆశిస్సులు మెండుగా ఉన్నాయని గుర్తించిన సీఎం కేసీఆర్, తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటి జాబితాలోనే టికెట్ కేటాయించారని సిర్పూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా బుధవారం మండలకేంద్రంలో టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముందుగా భారీ బైక్ ర్యాలీతో సమావేశ స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కోనప్ప మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షమ పథకాలు దేశంలోనే ఆదర్శమని పేర్కొన్నారు. రాష్ట్రంలో 60 వేల మంది రైతులకు రూ.75వేల కోట్ల మాఫీ చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు ప్రజలకు అవసరమున్న మరిన్ని పథకాలె ప్రవేశపెట్టి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషిచేశారని పేర్కొన్నారు. అందుకే ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు. టీఆర్‌ఎస్ శ్రేణులు ఉత్సాహంతో ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాగజ్‌నగర్ మున్సిపల్ అధ్యక్షురాలు సీపీ విద్యావతి, డీసీసీబీ డైరెక్టర్ తాళ్లపల్లి శ్రీరామారావు, ఆత్మా చైర్మన్ కొమురాగౌడ్, జడ్పీటీసీ లావుడె సుజాత, రైతుసమన్వయ కమిటీ మండల కన్వీనర్ సంతోశ్‌గౌడ్, సింగిల్‌విండో ఉపాధ్యక్షుడు కోండ్ర తిరుపతిగౌడ్, టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రసాద్‌రాజ్, పార్టీ నాయకులు రాచకొండ గిరీశ్, వీవీ ప్రసాద్, ఘనపురం శ్రీనివాస్, తాటి శ్రీనివాస్, కాసారం నగేశ్, పుప్పాల సంతోశ్, అల్గం మల్లేశ్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఏ సర్కారూ చేయని అభివృద్ధి : ఆసిఫాబాద్ అభ్యర్థి కోవ లక్ష్మి
సిర్పూర్(యు) : ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు ఇరవై ఏళ్లలో ఏ సర్కారు చేయనంత అభివృద్ధి చేసి చూపించామనీ, మళ్లీ ఆశీర్వదిస్తే దేశ చరిత్రలో నిలిచిపోయేలా చేసి చూపిస్తామని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పెద్దదోబలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ ఓటు టీఆర్‌ఎస్‌కే వేస్తామని భీం వారసులు ప్రకటించారు. అంతకుముందు సీతగొంది గ్రామంలో కంటివెలుగు పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. ప్రజలను పలుకరించగా, కండ్లద్దాలతో కండ్లు మంచిగకనబడుతున్నాయన్నారు. వెంటనే స్పందించిన ఆయన, కాంగ్రెస్ నాయకులు గానీ, కార్యకర్తలు గానీ ఎవరైనా ఉంటే వారికి కూడా పరీక్షలు మంచిగా చేయండయ్యా అంటూ సరదాగా వైద్యులకు సూచించారు. దీంతో ఆ ప్రాంగణమంతా ఒక్కసారిగా నవ్వులతో సందడిగా మారింది. అక్కడి నుంచి వెళ్తూ.. పంగిడి ప్రాంతంలో ఊరేగింపుగా వస్తున్న సవారీను కోవ లక్ష్మి, దర్శించుకున్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నాం ఆశీర్వదించాలని వేడుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావ్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాల, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు ఆత్రం భగవంత్‌రావ్, జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సెడ్మకి సీతారాం, టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి తొడసం ధర్మారావ్, సుబుర్‌ఖాన్, మాజీ సర్పంచ్ ఆత్రం జాలీంషా ఉన్నారు.

భారీ మెజార్టీతో పట్టం కట్టండి.. : మంచిర్యాల అభ్యర్థి దివాకర్‌రావు
దండేపల్లి : రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లిన టీఆర్‌ఎస్‌కే భారీ మెజార్టీతో పట్టం కట్టాలని మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు కోరారు. ప్రచారంలో భాగంగా బుధవారం మండలంలోని పాత మామిడిపెల్లి, కంచరబాయి, దమ్మన్నపేట, మామిడిగూడెం, లక్ష్మీకాంతాపూర్ గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ ప్రజలను పలకరించారు. అంతకుముందు మేదరిపేట నుంచి కంచరబాయి దాకా కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా మహిళలు బొట్టుపెట్టి దివాకర్‌రావును ఆశీర్వదించారు. మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. మామిడిపెల్లి మాజీ ఉప సర్పంచ్ చిన్నం భీంపటేల్, గిరిజన పెద్దలు(పటేల్) రాంపటేల్, రఘు, చిత్రు పటేల్ ఆధ్వర్యంలో దాదాపు 70 మంది మహిళలు, యువకులు టీఆర్‌ఎస్ చేరారు. వీరికి దివాకరరావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం కంచరబాయి, దమ్మన్నపేట, మామిడిగూడెంకు చెందిన గిరిజనులు టీఆర్‌ఎస్‌కే ఓటేస్తామని మాటిచ్చారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ మోటపల్కుల గురువయ్య, పీఏసీఎస్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, నాయకులు గోళ్ల రాజమల్లు, నజీర్, వెంగళరావు, బొమ్మెన మహేశ్, నలిమెల మహేశ్, గాలిపెల్లి చంద్రశేఖర్, చుంచు మల్లేశ్, శ్రీనివాస్, తిరుపతి, రమణయ్య, తిరుపతి, హన్మాండ్లు, సత్తయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

బాలికా విద్యను ప్రోత్సహించేందుకే...
కెరమెరి: మైనార్టీ బాలికల చదువును ప్రో త్సహించేందుకే ప్రభుత్వం సైకిళ్లను పంపిణీ చేస్తోందని జడ్పీటీసీ సయ్యద్ అబూల్‌కలాం అన్నారు. బుధవారం ఎంఆర్సీ కార్యాలయం లో మంజూరైన 24 సైకిళ్లను విద్యార్థినులకు అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మా ట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ విద్యావంతులుగా మారినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందన్నా రు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పా ఠశాలల్లో మౌలిక సదుపాయలు కల్పించి వి ద్యార్థులకు సన్నని బియ్యంతో మధ్యాహ్న భో జనంతో పాటు గుణాత్మకమైన విద్యను అం దిస్తున్నట్లు చెప్పారు. ఎంఈవో మల్లయ్య, ఈ వోపీఆర్డీ బుర్సపోచయ్య, కోఆప్షన్ సభ్యుడు షేక్ ఖుత్బోద్దీన్, నాయకులు షేక్ యూనుస్, ఇలాహి, మున్ను తదితరులు పాల్గొన్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...