ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి


Thu,September 20, 2018 12:11 AM

-బెల్లంపల్లి ఏరియా జీఎం రవిశంకర్
రెబ్బెన : ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని బెల్లంపల్లి ఏరియా జీఎం రవిశంకర్ పిలుపునిచ్చారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి అఫీసర్స్ క్లబ్‌లో బుధవారం బెల్లంపల్లి ఏరియా సింగరేణి యాజమాన్యం, బొగ్గు గని అధికారుల సంఘం సౌజన్యంతో సంయుక్తం గా అందించిన జ్యూట్ బ్యాగ్‌లను యన పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ముందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తే ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేయవచ్చని పేర్కొన్నారు. ప్రజా చైతన్యంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. ఏరియా ఆధికారుల సంఘం అధ్యక్షుడు చింతల శ్రీనివాస్ మాట్లాడుతు తమ వం తుగా ప్రయత్నం ప్రారంభించామనీ, అందరూ సహకరించాలని కోరారు. అధికారుల సంఘం నాయకులు, ఏరియా ఆధికారులు పాల్గొన్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...