పాఠశాలలో మాక్ పోలింగ్


Thu,September 20, 2018 12:10 AM

లక్షెట్టిపేట : మండలంలోని జెండా వెంకటపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులు మాక్(నమూనా ఎన్నికలు) పోలింగ్ నిర్వహించారు. దీనికి తహసీల్దార్ రాజేశ్వర్ హాజరై ఎన్నికల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా తయారు, బ్యాలెట్ బాక్స్, ఎన్నికల సామగ్రి, ఎన్నికల అధికారుల విధు లు, అధికారాలపై విద్యార్ధులకు తహసీల్దార్ అవగాహన కల్పించారు. అంతకు ముందు పాఠశాలలో విద్యార్థులు నమూనా కేబినేట్‌ను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియపై చర్చించారు. విద్యార్ధులే ప్రీసైడింగ్,అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ శ్రీనివాస్, ఎంపీటీసీ, పాఠశాల హెచ్‌ఎం రాజగోపాల్‌తోపాటు ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...