ఈవీఎంల పరిశీలన


Tue,September 18, 2018 11:47 PM

ఆసిఫాబాద్,నమస్తే తెలంగాణ: ముందస్తు ఎన్నికల సందర్భంగా ఎ లక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆధ్వర్యంలో ఈవీఎంల పనితీరు పై ఆయా పార్టీల రాజకీయ నాయకుల సమక్షంలో వాటిని ప్రదర్శిస్తున్నారు. మూడో రోజు మంగళవారం జాయింట్ కలెక్టర్ రాం బాబు సారథ్యంలో ఈవీఎంలను పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ ఈవీఎంల పనితీరుపై అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. 300కు పైగా బ్యాలెట్ యూనిట్లను, కంట్రోల్ యూనిట్లను పరిశీలించినట్లు తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ జి తేందర్, ఇంజినీర్లు, తదితరులు పాల్గొన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...