వన్యప్రాణులను వేటాడితే చర్యలు


Tue,September 18, 2018 11:47 PM

-నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేస్తాం
-జిల్లా ఫారెస్ట్ అధికారి లక్ష్మణ్ రంజిత్‌నాయక్
పెంచికల్‌పేట్: వన్యప్రాణులను వేటాడడం, అటవీ సంపదను నా శనం చేసిన వారిపై అటవీ చట్టం ప్రకారం నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఫారెస్ట్ అధికారి లక్ష్మణ్ రంజిత్ నాయక్ అ న్నారు. మండల కేంద్రంలోని రేంజ్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వన్యప్రాణులపై ఉచ్చులు, ఉరులు అమర్చినా అట్టివారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. పీడీయాక్టు చట్టంపై జిల్లాలోని అన్ని గ్రామాల్లో కళాజాత బృందం ద్వారా వారంలో ప్రజలకు, రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. అనంతరం కొండపల్లి బీట్ ప్రాం తంలో ప్లాన్‌టేషన్‌లో నాటిన మొక్కలను పరిశీలించారు. డివిజనల్ ఫారెస్ట్ అధికారి రాజారమణారెడ్డి, రేంజర్ అనిత, ఎఫ్‌ఎస్‌ఓ సుధా కర్, ఎఫ్‌బీఓ సాగరిక, బయాలాజిస్టు రవికాంత్, తదితరులున్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...