మెరుగైన విద్యనందించాలి


Tue,September 18, 2018 11:47 PM

-జిల్లా నోడల్ అధికారి ఏ గోపాల్
-జైనూర్ జూనియర్ కళాశాల, కేజీబీవీ తనిఖీ
జైనూర్: విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని జిల్లా నోడల్ అధికారి ఏ గోపాల్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళశాల, పోచ్చంలొద్దీ కేజీబీవీ పాఠశాలను మంగళవారం తని ఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. కళాశాలలో బయోమెట్రిక్ యంత్రాల వినియోగంపై ఆరా తీశారు. విద్యార్థులకు అందుతున్న బోధనను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల కు సిలబస్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధ్యాపకులతో మా ట్లాడుతూ ఇంటర్ స్థాయి విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ నేర్పాలని సూచించారు. విద్యార్థులు భవిష్యత్, లక్ష్యంపై ఏకాగ్రత క ల్పించాలన్నారు. సభ్యులు తిరుపతి, ప్రిన్సిపాల్ శ్రావణ్, ప్రత్యేకా ధికారి రేణుక, అధ్యాపకులు రాంబాబు, సురేష్, అనిత పాల్గొన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...