నీట మునిగి ఇద్దరి మృతి


Tue,September 18, 2018 11:46 PM

-నంబాలలో చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరు.. పెంచికల్‌పేట్‌లో ఈతకు వెళ్లి యువకుడు
-కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు
పెంచికల్‌పేట్: సరదాగా ఈతకోసం వెళ్లి పెద్దవాగు మడుగులో మునిగి యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని గొంట్లపేటలో మంగళవారం విషాదం నింపింది. ఎస్‌హెచ్‌ఓ రఘునాథ్ సర్కార్ తెలిపిన వివరాల ప్రకారం గొంట్లపేట గ్రామానికి చెందిన సాదు ఆదిత్య(21) గ్రామ సమీపంలోని పెద్దవాగు మడుగులో ఈత కోసం మంగళవారం మధ్యాహ్నం వెళ్లాడు. ఈతకొట్టే సమయంలో ఆది త్య లోతైన నీటి మడుగులో మునిగి గల్లంతయ్యా డు. గమనించిన స్నేహితులు ఆదిత్య కుటుంబ స భ్యులు, గ్రామస్తులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు, జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. సాదు రాజారాం, సుగుణ దంపతుల నలుగురు సం తానంలో ఏకైక కుమారుడు ఆదిత్య. సంఘటనా స్థలానికి కాగజ్‌నగర్ రూరల్ సీఐ ప్రసాద్‌రావు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్ నాయ కులు కోనేరు కృష్ణారావు, కట్ట ప్రసాద్ బాధిత కు టుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆదిత్య రైతుబీమాకు అర్హుడు కావడం తో ప్రభుత్వం ద్వారా బీమా డబ్బులు త్వరలోనే అందించి ఆదుకుంటామన్నారు.

రెబ్బెన: మండలం లోని నంబాల గ్రామంలో గల చాపిడికుంటలో ప్రమాదవశాత్తు పడి ఎర్గటి పోశమ ల్లు(38) మృతి చెందినట్లు ఎస్‌ఐ దీకొండ రమేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నం బాల గ్రామ పంచాయతీలోని మన్నెగూడం కు చెందిన ఎర్గటి పోషమల్లు కూలీ పనులు చేసుకుంటు జీవిస్తున్నాడు. గ్రామం దగ్గర ఉన్న చాపిడికుంటలో చేపలు పట్టడం కోసం ఉదయం పోశమల్లు బయలు దేరి వెళ్లాడు. చాపిడికుంటలో చేపలు పడుతున్న క్ర మంలో ప్రమాదవసాత్తు కుంటలో పడిపోయాడు. ఈత రానందున నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలిపారు. ఎర్గటి పోషమల్లు భార్య ఎర్గటి శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...