ఫిర్యాదుదారులతో మర్యాదగా మెలగాలి


Tue,September 18, 2018 01:37 AM

-సమస్యలపై సత్వరమే స్పందించాలి
-నేర పరిశోధనలో సాంకేతికతను వినియోగించుకోవాలి
-నేర సమీక్షలో ఎస్పీ మల్లారెడ్డి
ఆసిఫాబాద్ రూరల్: పోలీస్ అధికారులు ఫిర్యా దు దారుల పట్ల మర్యాదగా మెలగాలని ఎస్పీ మల్లారెడ్డి ఆదేశించారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని పోలీస్ అధికారులతో ఆయన నెలవారీ నేర సమీక్ష సోమవారం నిర్వహించారు. జిల్లాలోని పో లీస్ అధికారులు ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను పాటిస్తూ ప్ర జలు, ఫిర్యాదు దారులతో సన్నిహితంగా ఉండాలన్నారు. ఫిర్యాదుదారుల సమస్యలను సావకాశంగా విని ఒక వేళ నేరం జరిగిందని భావిస్తే వెంటనే కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ కాపీ ని ఫిర్యాదు దారుడికి అందించాలని సూచించారు. ఫిర్యాదులు భూ సంబంధమైనవి, కుటుం బ సంబంధమైనవి, సివిల్ తగాదాలకు చెందినవి అ యితే భార్యా భర్తల తగవులకు చెందినవి అయితే ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు పంపించాలన్నారు. అనంతరం జిల్లాలోని నేరాలపై పోలీస్ స్టేషన్ల వారీగా స మీక్షించారు. కేసులకు సం బంధించి ఎఫ్‌ఐఆర్ మొదలు ప్రణాళికాబద్దంగా వ్యవహరించి సాక్ష్యాధారాలు సేకరించి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలన్నారు.

కొత్తగా వచ్చిన అధికారులతో దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా కేసుల న మోదు, నేరపరిశోధ నపై అవగాహన కల్పించారు. ఎప్పటికప్పుడు నూతనంగా ప్రవేశ పెడుతున్న సాం కేతికతను ఆకలింపు చేసుకొని నేరపరిశోధనలో వినయోగించుకోవాలని సూచించారు. డీఎస్పీలు, సీఐ లు ఎప్పటికప్పుడు ఎస్‌ఐల పనితీరును సమీక్షిస్తూ వారి పనితీరును మెరుగుపర్చుకునేలా చూడాలన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. పెండింగ్ కేసుల పరిశోధన పూర్తి చేసి చార్జిషీట్ దా ఖలు చేయాలని ఎస్పీ మల్లారెడ్డి సూచించారు. జి ల్లాలో నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు కళాబృందాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో కళా బృందాల నాటకాలు, పాటలు మూఢనమ్మకాలు, బాల్య వి వాహాలు, రోడ్డు ప్రమాదాలు, యువత పెడదారు లు పట్టకుండా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. గ్రామ పోలీస్ అధికారులు గ్రామీణ ప్రజల తో సత్సంబంధాలు కలిగి ఉండేలా చూడాలన్నారు. గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని పురష్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే చోట ప్రత్యేక నిఘా ఉంచి అవి పునరావృతం కా కుండా చూడాలన్నారు. అడిషనల్ ఎస్పీ గోద్రు, కాగజ్‌నగర్ డీఎస్పీ సాంబ య్య, ఎన్నికల సెల్ ఇన్‌చార్జి రామారావు , సీసీ మనోజ్ కుమార్, ఐటీ కోర్ సభ్యులు శ్రీనివాస్, విజయ్‌లాల్, జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలున్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...