కోర్టు భవన నిర్మాణానికి కృషి


Tue,September 18, 2018 01:35 AM

మంచిర్యాల లీగల్ : నూతన కోర్టు పక్కా భవన నిర్మాణానికి కృషిచేస్తానని మంచిర్యాల టీఆర్‌ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మంచిర్యాల న్యాయవాదులను సంప్రదించి, తన అభ్యర్థిత్వాన్ని బలపర్చాలని కోరారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్, అడ్వకేట్ పులి రాయమల్లు నేతృత్వంలో బార్ హాలులో సమావేశం నిర్వహించారు. న్యాయవాదుల ఇండ్ల స్థలాలను సైతం ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. బార్ అధ్యక్షుడు గడికొప్పుల మురళీధర్, ప్రధాన కార్యదర్శి బండవరం జగన్, సీనియర్ న్యాయవాదులు ఎం రవీందర్‌రావు, ఎంఎన్ రెడ్డి, చుంచు సదానందం పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...