ఈవీఎంలు వచ్చేశాయ్..


Wed,September 12, 2018 11:53 PM

-రాష్ట్రంలోనే తొలుత జిల్లాకు..
-బెంగుళూర్ నుంచి ప్రత్యేక వాహనంలో తెచ్చిన అధికారులు
-మార్కెట్ యార్డులోని గోదాంలో నిల్వ
-పటిష్ట బందోబస్తు ఏర్పాటు
-త్వరలోనే హర్యానా నుంచి 720 వీవీ ప్యాట్ల రాక
కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్లను అధికారులు బుధవారం జిల్లాకు తెప్పించారు. మూడు రోజుల క్రితం ఈవీఎంల కో సం బెంగుళూర్‌కు వెళ్లిన అధికారులు ప్రత్యేక భద్రత నడుమ జిల్లాకు అవరసమైన యంత్రాలను తీసుకువచ్చారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు గో దాంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి గట్టి బందోబస్తు నడు మ వాటిని భద్రపరిచారు. ప్రత్యేక వాహనంలో 15 2 ఐరన్ బాక్సుల్లో ఈవీఎంలను జిల్లాకు తెచ్చారు. బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపె నీ నుంచి ఈ యంత్రాలను తీసుకువచ్చారు. 85 బాక్సుల్లో 850 బ్యాలెన్సింగ్ యూనిట్లను( బీయు), 67 బాక్సుల్లో కాంటాక్టు యూనిట్ల్లు(సీయు) ఉ న్నాయి. 152 బాక్సుల్లో జిల్లాకు కావాల్సిన ఈవీఎంలు జిల్లాకు తీసుకువచ్చారు. మరో మూడు నాలుగు రోజులు హర్యానా నుంచి జిల్లాకు అవసరమైన 720 వీవీ ప్యాట్‌లను తెప్పించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు.

తొలుత మన జిల్లాకే..
అసెంబ్లీ రద్దు అనంరతం రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఈ క్రమంలో రాష్ట్రంలోనే తొలుత జిల్లాకు ఈవీఎంలు చేరుకున్నాయి. ఆసిఫాబాద్ ఆర్డీ ఓ సురేష్, తహసీల్దార్ బౌమిక్ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారుల బృందం మూడు రోజుల క్రితం బెంగుళూరు వెళ్లింది. అక్కడి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఈ మిషిన్లను ప్రత్యేక వాహనంలో మంగళవారం రాత్రి జిల్లాకు తీసుకువచ్చారు. ఎస్పీ కార్యాలయంలో బందోబస్తు నడుమ ఉంచారు. బుధవా రం ఉదయం 11 గంటల సమయంలో మార్కెట్ యార్డులోని గోదాంలోకి చేర్చారు. వాహనంలో తీ సుకువచ్చిన యంత్రాలను వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో వాహనానికి వేసిన సీలును పరిశీలించి, తెరిచారు. అనంతరం బాక్సులను గో దాంలో నిల్వ చేశారు.

హర్యానా నుంచి వీవీప్యాట్లు
ఈ సారి కొత్తగా ప్రవేశపెడుతున్న వీవీ ప్యాట్‌లను త్వరలోనే హర్యానా నుంచి తీసుకువచ్చేందుకు అధికారుల బృందం అక్కడికి వెళ్లనుంది. దీనికోసం బుధవారం సాయంత్రం అధికారులు బయల్దేరినట్లు సమాచారం. మరో మూడు నాలుగు రోజుల్లో అవసరమైన వీవీప్యాట్లను జిల్లాకు తీసుకురానున్నారు. త్వరలోనే అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఈవీఎంల పనితీరుతో పాటు, ఓటు వేసిన తరువాత ఎవరికి ఓటు వేశామో రిసిప్టును కూడా వీవీప్యాట్ల ద్వారా అందించనున్నారు. పూర్తిస్థాయిలో మిషిన్లు జిల్లాకు చేరుకున్న తర్వాత రాజకీయ పార్టీల నాయకుల సందేహాలను నివృత్తి చేయనున్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...