నాణ్యమైన విద్యనందించాలి


Wed,September 12, 2018 11:51 PM

జైనూర్: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి ఉపాధ్యా య సిబ్బందిని ఆదేశించారు. పోచ్చంలొద్దిలో కేజీబీవీ పాఠశాలను బుధవారం తనిఖీ చేశారు. జిల్లా విద్యాధికారిగా నియామకమైన రవీందర్ రెడ్డి మొ దటి సారిగా ఈ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం పరిశీలించారు. ఉపాధ్యాయ హాజరు పట్టిక పరిశీలించి, విద్యార్థులతో సమస్యల డిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న బోధనా తీరుపై ఆరా తీశారు. ఆయన వెంట పాఠశాల ప్రత్యేకాధికారిణి రేణుక ఉన్నారు.
కాగజ్‌నగర్ టౌన్: జాతీయ బాలల సైన్స్ కాం గ్రెస్-2018లో ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి సూచించారు. ఎల్లగౌడ్‌తోటలోని ప్రయివేట్ పాఠశాలలో నిర్వహించిన 26వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ 2018 సైన్స్ ఉ పాధ్యాయులకు శిక్షణలో పాల్గొని మాట్లాడారు. పరిశుభ్రత, హరిత, ఆరోగ్య కరమైన దేశం కోసం శాస్త్ర-సాంకేతిక నూతన ఆవిష్కరణల అంశాలపై విద్యార్థులకు క్లుప్తంగా బోధించాలని సూచించారు. ఇన్‌స్ఫైర్ నామినేషన్ వివరాలను డీఎస్‌వో మధూకర్‌ను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల వివరాలు, సైన్స్ కాంగ్రెస్‌లో ఎంత మంది విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉందని అడిగి తెలుసుకున్నారు. డిసెంబ ర్ 31వ నాటికి 17 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలు సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు అర్హులన్నారు. పాఠశాలలో సమస్యలను దాతల ద్వారా సదుపాయాల కల్పనకు కృషి చేసిన ఉపాధ్యాయులు, హరిత పాఠశాలలు, పదో తరగతి ఉత్తీర్ణతలో పెరుగుదలపై శ్రద్ధ చూపిన ఉపాధ్యాయులను అవార్డులకు ఎంపిక చేస్తామన్నారు. ఎంఈవో భిక్షపతి, రాజేశం, తిరుపతయ్య, రాజేశం, రవీందర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...