కంటి వెలుగును వినియోగించుకోండి


Wed,September 12, 2018 11:51 PM

-డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్
-శిబిరం సందర్శన
-వైద్య సిబ్బందికి ఆదేశాలు
కెరమెరి: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్ సూచించారు. మండల కేంద్రంలోని ఝరి గ్రామంలో నిర్వహించిన శిబిరాన్ని సందర్శించి వైద్య సిబ్బందితో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రజల కంటి చూపును మెరుగుపర్చేందుకే ప్రభుత్వం కార్యక్రమాని రూపొందించిందని పేర్కొన్నారు. వైద్యాధికారి అనంత్‌కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేయాలని కోరారు. చిన్నారుల నుంచి వృ ద్ధుల వరకు అందరి కంటి చూపును పరీక్షించాలని చెప్పారు. ఏ మాత్రం చూపులో ఇబ్బందులుంటే వైద్య సేవలు అందించాలన్నారు. అవసరమైన వా రికి అద్దాలు, మందులతో పాటు కంటిపొరవచ్చిన వారికి శాస్త్ర చికిత్స చేయించేందుకు పేర్లు నమోదు చేయాలన్నారు. ప్రతి గ్రామంలోని ప్రజలందరికీ ముందుగానే సమాచారం అందించి పరీక్షా కేంద్రానికి వచ్చేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వైద్యాధికారులు సుంకన్న, అనంత్‌కృష్ణ, ఫార్మసిస్ట్ ఖలీల్‌హుస్సేనీ, సూపర్‌వైజర్లు మెస్రం సోము, లక్ష్మికాంత ఆశవర్కర్లు సిబ్బంది ఉన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...