ఎస్పీఎం కార్మికులకు అండగా సర్కారు

Wed,September 12, 2018 11:50 PM

-మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
-కాలనీల్లో సమావేశాలు
-పార్టీలో పలువురి చేరిక
కాగజ్‌నగర్ టౌన్ : ఎస్పీఎం కార్మికులకు తెలంగాణ సర్కారు అండగా ఉంటున్నదని మాజీ ఎమ్మెల్యే కోనప్ప అన్నారు. బుధవారం తన నివాసంలో మహిళలతో సమావేశం నిర్వహించారు. యాజమాన్యం తప్పిదం వల్ల ఎస్పీఎం మూతబడడంతో కార్మిక కుటుంబాలు వివిధ ప్రాంతాలకు వలస వెళ్లి చాలీచాలని వేతనలతో ఇబ్బందులు పడుతూ బతుకులు వెళ్లదీశారన్నారు. అయితే 2014లో తాను గెలిచిన తర్వాత మిల్లు ప్రారంభంతోనే కార్మికుల కష్టాలు, ఊరు బాగుపడుతుందనీ, సీఎం కేసీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, జేకే యజమాన్యానికి ప్రభుత్వం రాయితీలను కల్పించడంతో ఆగస్టు 2న పునః ప్రారంభంమై పనులు కొనసాగుతున్నాయన్నారు. డిసెంబర్‌లోగా ఉత్పత్తి ప్రారంభించేందుకు పనులు వేగవంతం జరుగుతున్నాయన్నారు. గతంలో కార్మికుల పిల్లల చదువులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు రూ.34 లక్షల ఫీజులు కట్టి కొనసాగించేలా చూశామన్నారు. క్వార్టర్లలో విద్యుత్, తాగునీటి విభాగాల్లో పని చేస్తున్న వారికి రూ.2కోట్ల 25 లక్షల నిధులు సీఎం మంజూరు చేశారని గుర్తుచేశారు. అంతేగాకుండా నాలుగేళ్లలో కార్మికులకు రావాల్సిన బకాయిలను వారి ఖాతాల్లో కోర్టు తీర్పు ఆధారంగా రూ. 63700 ఇప్పించినట్లు తెలిపారు.

అదే విధంగా మున్సిపాల్టీ అభివృద్ధి కోసం రూ.25 కోట్లు మంజూరయ్యాయనీ, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. పట్టణంలో తాగునీటి సమస్యను తీర్చేందుకు త్రిశూల్ పహడ్‌పై రూ.8.50 కోట్లతో ట్యాంకు నిర్మాణం చేపట్టి పైపు లైన్ల ద్వారా కాలనీల్లో రెండు పూటల నీరు అందిస్తున్నామన్నారు. కాపువాడలో నీటి సమస్యను తీర్చేందుకు వ్యవసాయ మార్కెట్‌లో ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేశామని తెలిపారు. పట్టణంలో స్త్రీ శక్తి భవన నిర్మాణం, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలకు త్వరలో పనులు చేపడుతామని తెలిపారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నన్ను మళ్లీ గెలిపించాలని కోరారు. అంతకు ముందు కాపువాడ, సర్‌సిల్క్, నౌగాంబస్తీ, వార్డు నెంబర్, 4,5,6,7, సంఘం బస్తీ, సుభాష్ కాలనీ వాసులు 2200 మంది కోనప్ప ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సీపీ విద్యావతి, ఎమ్మెల్యే సతీమణి రమాదేవి మహిళలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గిరీష్ కుమార్, విజయ్ యాదవ్, శివప్రసాద్, జానిమియా, శ్రీను, టీఆర్‌ఎస్ నాయకులు సీపీ రాజ్ కుమార్, జాకీర్ షరీఫ్, ప్రసాద్, టీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

112
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles