రక్త హీనత తొలగించేందుకే పోషణ్ అభియాన్

Wed,September 12, 2018 11:50 PM

-డీఎంహెచ్‌వో సుబ్బారాయుడు
-పోషకాహారంపై అవగాహన
ఆసిఫాబాద్ రూరల్: దేశ వ్యాప్తంగా పోషణ లో పం, రక్తహీనతను తొలగించేందుకే పోషణ అభియాన్ ప్రారంభించినట్లు జిల్లా వైద్యాధికారి సు బ్బారాయుడు అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమాధికారిణి సావిత్రితో కలిసి జిల్లాలోని సీడీపీవోలు, సూపర్‌వైజర్లతో పోషణ్ అభియాన్‌పై బుధవారం సమీక్ష నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ సెప్టెంబర్‌ను జాతీయ పోషణ మాసంగా గుర్తించినట్లు చెప్పారు. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మార్చి 8న ప్రారంభించినట్లు పేర్కొన్నారు. దేశంలో పోషణ లోపం, రక్తహీనత తొలగించే లక్ష్యంగా కార్యక్రమాన్ని రూపొందించి జనపోషణ్ టెక్నాలజీ సా యంతో లబ్ధిదారులకు శ్రేష్టమైన ఆహారం అందేలా చూస్తున్నామన్నారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, 6 ఏండ్లలోపు పిల్లల పోష ణ స్థాయిని మెరుగుపర్చడమే కార్యక్రమ లక్ష్యమన్నారు. ఇందు లో భాగంగానే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నెలాఖరు వరకు ఏ ఊరిలోనూ రక్తహీనతతో బాధపడే వారు ఉండకూడదనే లక్ష్యంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.

శిశు సంక్షేమాధికారిణి సావిత్రి మాట్లాడు తూ పోషణ అభియాన్‌లో భాగంగా కురుచదనం, తక్కువ బరువు, రక్త హీనతతో పుట్టిన పిల్లలు మొ దటి వంద రోజుల జీవిత కాలం ఉన్న గర్భం ఉన్న వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి పోషణ స్థాయి పెరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోషణ లోపానికి గురైన వారిని గుర్తించి వారికి పోషకాహారం అందేలా సీడీపీవోలు, సూపర్‌వైజర్లు చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖలు వైద్యం, విద్య, మెస్మా, పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్, తదితర శాఖల సహకారంతో లక్ష్యాల ను సాధించాలని సూచించారు. ప్రజలకు పోషకాహారంపై సరైన అవగాహన కల్పించడంతో పాటు సర్పంచ్‌లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, లబ్ధిదారులను ప్రోత్సహించి వారిలో మార్పు కో సం కృషి చేయాలన్నారు. డీఆర్ డీవో ఏపీడీ రామకృష్ణ, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

128
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles