శాంతియుతంగా నిర్వహించుకోవాలి


Wed,September 12, 2018 12:55 AM

-ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవాలి
-వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి
-శాంతికమిటీ సమావేశంలో ఎస్పీ మల్లారెడ్డి
ఆసిఫాబాద్ రూరల్: ప్రతి ఒక్కరూ శాంతియు త వాతావరణంలో పండుగలు నిర్వహించు కో వాలని ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశానికి ఆయన ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భం గా శాంతి కమిటీ సభ్యులైన ఇరువురు మత పెద్ద లు మాట్లాడుతూ ఆసిఫాబాద్ మత సామరస్యానికి మారుపేరుగా ఉందని ఇక్కడ ఇంత వరకు ఎలాంటి మత కలహాలు చెలరేగలేదన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఇతర ప్రాంతాల వారికి ఆదర్శం గా నిలిచి మత సామరస్యానికి మారుపేరుగా ఒక రి పండుగలకు మరొకరు సహకరించుకుంటారన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మల్లారెడ్డి మాట్లాడుతూ మతసహనం , పరస్పర సహకారం ఉన్న చోట శాంతి ఉంటుందనీ, అది ఆసిఫాబాద్‌లో ఉ న్నట్లు ఇరువర్గాల పెద్దల మాటల వల్ల తెలుస్తోందన్నారు.

వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలనీ , పోలీసులు సూచించే నిభందనలు, సూచనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో చూస్తామని హామీ ఇచ్చారు. త్వరలో జి ల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిమజ్జనానికి కావాల్సిన సదుపాయాలు, శాంతి కమిటీ, ఉత్సవ కమి టీ సభ్యులతో చర్చించి పరిష్కారం అయ్యేలా చ ర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో టౌన్ సీఐ మల్లయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ గం ధం శ్రీనివాస్, ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హన్నన్, మైనార్టీ నాయకులు అబ్దుల్ ఫ యాజ్ , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిట్ల నారాయణ, ఆర్య వైశ్య సంఘ నాయకుడు ప్రమో ద్, బీజేపీ నాయకుడు భోనగిరి సతీష్ బాబు, సీపీ ఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ, ఆయా వినాయక మండపాల ప్రతినిధులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌లో ఏఎస్పీ గోద్రు..
కాగజ్‌నగర్ టౌన్: గణేశ్ నవరాత్రి ఉత్సవాల ను శాంతి యుతంగా నిర్వహించాలని ఏఎస్పీ గోద్రు అన్నారు. మంగళవారం పోలీస్టేషన్‌లో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఆ యన పాల్గొని మాట్లాడారు. గణేశ్ నవరాత్రి ఉ త్సవాలను శాంతి యుతంగా నిర్వహించాలనీ, గణేశ్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పా టించాలన్నారు. పోలీసుల సూచనలు పాటించి శాంతి యుతంగా ఉత్సవాలను జరుపుకోవాల న్నారు. నవరాత్రుల అనంతరం వినాయక నిమజ్జ నం ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ కాగజ్‌నగర్ డీఎస్పీ సాంబయ్య, ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్, మండళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...