టీఆర్‌ఎస్‌లో చేరిక

Wed,September 12, 2018 12:55 AM

రెబ్బెన/చింతలమానేపల్లి : రెబ్బెన మండలం గోలేటిలో మంగళవారం ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సమక్షంలో కైర్‌గూడకు చెందిన 100 మంది గ్రామస్తులు, చింతలమానేపల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో 100 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయన్నారు.
ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో మంగళవారం తాజా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ఆధ్వర్యంలో మహిళలు, యువకులు భారీగా టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. స్థానిక శాంతినగర్ ఒడ్డెరుల సంఘ భవనంలో వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. కాగా, ఈ ఎన్నికల్లో తామంతా టీఆర్‌ఎస్‌కే మద్దతు ఇస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తప్పకుండా టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తామని బహిరంగంగా ప్రమాణం చేశారు. వారందికీ పార్టీ తరపున తాజా మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ధన్యవాదాలు తెలిపారు.

107
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles