పనితీరుతోనే ఉద్యోగికి గుర్తింపు


Wed,September 12, 2018 12:55 AM

-కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు
-జిల్లా కేంద్రంలో జేసీ అశోక్ కుమార్‌కు వీడ్కోలు కార్యక్రమం
ఆసిఫాబాద్ రూరల్: ప్రతి ప్రభుత్వ ఉ ద్యోగికి పనితీరుతోనే గుర్తింపు వస్తుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అన్నా రు. ఆసిఫాబాద్ జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ బదిలీ అయిన నేపథ్యంలో మం గళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశానికి ఆయన హాజరయ్యారు. నూతనంగా ఏ ర్పాటైన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లో జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అశోక్ కుమార్ సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించి అందరి మన్నన లు పొందారని ప్రశంసించారు. వెనకబడి న ఈ జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన జేసీని ఈ ప్రాంత ప్రజలు ఎన్నటికి మరవలేరన్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలిసి ఆయన జాయింట్ కలెక్టర్ అ శోక్ కుమార్‌ను ఘనంగా పూలమాలలు , శాలువాలతో సన్మానించారు. జేసీ అశో క్ కుమార్ మాట్లాడుతూ ఆసిఫాబాద్ జి ల్లాలో పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ జేసీ అశోక్ కుమార్ ఎంతో అనుభవం ఉన్న అధికారి అని, అందరినీ బిడ్డా అని ఆప్యాయంగా పిలుస్తూ తమ సమస్యలను సమరస్యం గా పరిష్కరించి తెలియని విషయాలను ఓపిగ్గా చెప్పి పనులు చేయించే వారని ఆయన వద్ద పనిచేసి తమ పనితీరును మెరుగుపర్చుకున్నామన్నారు. డీఆర్వో రాజేశ్వర్, సీపీ ఓ కృష్ణయ్య, డీపీఓ గంగాధర్, తదిత రులు పాల్గొన్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...