పేదల కోసమే కంటి వెలుగు

Wed,September 12, 2018 12:54 AM

-ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి
-ఎమ్మెల్సీ పురాణం సతీశ్, మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
రెబ్బెన: పేదల కోసమే రాష్ట్ర సర్కారు కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కు మార్ అన్నారు. మండలంలోని గోలేటి గ్రామంలో కొన సాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం ఆసిఫా బాద్ మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి ఆయన సంద ర్శించారు. ఈ సందర్భంగా శిబిరానికి వచ్చిన ప్రజలతో మట్లాడడంతో పాటు సిబ్బందిని శిబిరం నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కంటి ప రీక్షలు చేయించుకోగా, సిబ్బంది అద్దాలు అందజేశారు. ఎ మ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ స ర్కారు రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదనీ, వారందరూ కంటి వెలుగు పథకంలో కంటి పరీక్షలు చేయించుకోవాలని ఎద్దేవా చేశారు. రాష్ట్ర మంతా కంటి వెలుగు పథకంపై ప్రశంసలు కురిపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వా రి వెంట టీఆర్‌ఎస్ నాయకులు, వైద్య సిబ్బంది ఉన్నారు.

వాంకిడి: మండల కేంద్రంలోని స బ్‌సెంటర్‌లో ఏర్పాటు చేసిన కంటి వె లుగు శిబిరం మంగళవారంతో ముగి సింది. ఇప్పటి వరకూ 3 968 మంది రోగులకు కంటి పరీక్షలు చేయగా, 1084 మందికి అద్దాలు ఇవ్వగా, 584 మందికి అందించాల్సి ఉంది. కాగా ఆపరేషన్ కోసం 681 రెఫర్ చే సినట్లు శిల్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్యనిపు ణులు డా. శిల్ప, ప్రతిమ, సూపర్‌వైజర్ శ్యాంలాల్, స్థానిక వైద్య సిబ్బంది రాజన్న, రాజేశ్వర్, రుక్మిణీ, క్రుపవాణి, తదితరులున్నారు.
నేటి నుంచి బెండారలో..
మండలంలోని బెండార గ్రామంలోని సబ్‌సెంటర్‌లో బుధవారం నుంచి కంటి వెలుగు వైద్యశిబిరం నిర్వహించ నున్నట్లు వైద్యురాలు శిల్ప తెలిపారు.

114
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles