పకడ్బందీగా తయారు చేయాలి


Wed,September 12, 2018 12:54 AM

రెబ్బెన: మండలంలోని బూత్ లెవల్ అధికారులు ఓటరు జాబితా పకడ్బందీగా తయారు చేయాలని తహసీల్దార్ సాయన్న సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం లో మంగళవారం మం డలం లోని 34 పోలింగ్ కేంద్రాల బీఎల్‌ఓలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 15,16 తేదీల్లో ప్రత్యేక ఓటరు దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన యువతీయువకులు ఓటరుగా నమోదు చేసుకునేలా బీఎల్‌వోలు చూడాలన్నారు.

లింగాపూర్: 18 ఏళ్లు నిండిన యువతీయువకులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని టీఆర్‌ఏస్ నాయకుడు కోత్తపల్లి మాజీ సర్పంచ్ ఉదయ్ లక్ష్మి అన్నారు. మంగళవారం కొత్తపల్లి గ్రామంలో టీ ఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై యువతీయువకులకు అవ గాహన కల్పించారు.

సిర్పూర్(యు): మండలంలో ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో వీఆర్వో, బీల్‌ఓలకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఓటరు జాబితా సిద్ధంగా ఉండాలన్నారు. 18 ఎనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనీ, జాబితాలో తప్పొప్పులను సవరించాలని కోరారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...