పల్లెల్లో ప్రచార హోరు

Tue,September 11, 2018 12:39 AM

-సిర్పూర్ నియోజకవర్గంలో కోనప్ప బిజీబిజీ
-కౌటాల, చింతలమానేపల్లి మండలాల్లో బైక్‌పై..
-ఘన స్వాగతం పలికిన ప్రజలు
-జై కేసీఆర్.. జైజై కోనప్ప నినాదాలు
-నవేగాంలో కోవ లక్ష్మి సమావేశం..
-పలు అభివృద్ధి పనులకు భూమి పూజ
-టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు
కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పల్లెల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అసెంబ్లీ రద్దు తర్వాత జిల్లాకు చేరుకున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో బీజీ అయిపోయారు. సిర్పూర్-టి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప తన వినూత్నమైన ప్రచారంతో హల్‌చల్ చేస్తున్నారు. సిర్పూర్-టి నియోజకవర్గంలోని కౌటాల, చింతలమానేపల్లి మండలాల్లో స్వయంగా బైక్ నడుపుతూ పర్యటించారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ అభ్యర్థి కోవ లక్ష్మి, వాంకిడి మండలం నవేగూడలో ప్రచారం చేశారు.

పల్లెల్లో బైక్‌పై కోనప్ప
సిర్పూర్-టి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నాలుగు రోజులుగా నియోజవర్గంలోని పలు మండలాల్లో పర్యటిస్తున్నారు. నాలుగేళ్లలో ఎమ్మెల్యేగా అభివృద్ధి పరుగులు పెట్టించిన కోనప్ప ఇప్పుడు ప్రచారంలో కూడా తన దూకుడు కొనసాగిస్తున్నా రు. సోమవారం నియోజకవర్గంలోని కౌటాల, చిం తలమానేపల్లి మండలాల్లోని గుండాయిపేట, విర్దం డి, దిందా, శివపల్లి, సదాశివపేటలో బైక్‌పై తిరుగుతూ ప్రచారం చేశారు. ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. బొట్టుపెట్టి ఆహ్వానించారు.

నవేగాంలో కోవ లక్ష్మి ప్రచారం
ఆసిఫాబాద్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి సోమవారం వాంకిడి మండలం నవేగూడలో ప్రచారం నిర్వహించారు. ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి నాలుగేళ్లలో చేపట్టిన అభివృద్ధి గురిం చి వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరాయనీ, ప్ర జలు మళ్లీ టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ ప్రచారం చేశారు.

ఘన స్వాగతం
ప్రచారం కోసం వస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు కోనేరు కోనప్ప, కోవ లక్ష్మికి ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. బొట్టుపెట్టి గ్రామాల్లోకి ఆహ్వానిస్తున్నారు. ఇంతకాలం అభివృద్ధి పను లు చేపట్టేందుకు గ్రామాల్లో పర్యటించిన కోనప్పకు ప్రజలు ఎంత అభిమానంతో స్వాగతం పలికారో... కోనప్ప ఇప్పుడు ప్రజలను ఓట్లు అడిగేందుకు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గ్రామాలకు వెళ్లినప్పుడు కూడా అంతే అభిమానంతో ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే పట్టం కడుతామని హామీ ఇచ్చారు.

టీఆర్‌ఎస్‌లో చేరికలు
సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల మండలం గుండాయిపేటలో 200 మంది, విర్దండిలో 100 మంది, సదాశిపేటలో 50 మంది, చింతలమానేపల్లి మండలం దిందాలో 50 మంది మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సమక్షంలో సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో ఫాస్టర్లు పొన్నల నారాయణ, రాజరత్నంతో పాటు తదితరులు సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిందన్నారు. అభివృద్ధిని చూసే ప్రజలు పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

112
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles